సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖపట్నంలో సమైక్యవాదులు చేస్తున్న ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. సమైక్య ఉద్యమానికి మద్దతుగా నగరంలోని హెచ్పీసీఎల్, బీపీసీఎల్,ఐఓసీ కంపెనీలల్లోని చమురు కేంద్రాలు మూతపడ్డాయి. ఆ కేంద్రాల నుంచి చమురును ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన దాదాపు 750 లారీలు నిలిచిపోయాయి. దాంతో ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు చమురు రవాణా నిలిచిపోయింది.
సమైక్యానికి సంఘీభావంగా విశాఖపట్నంలోని 12 రైతు బజార్లు మూసివేశారు.కేజీహెచ్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను వైద్యులు నిలిపివేశారు. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. దాంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.