సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలోని పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలతో గోదావరి నది పోటెత్తుతోంది. ప్రాణ హిత, ఇంద్రావతి, శబరి ఉప నదులతోపాటు తాలి పేరు, కిన్నెరసాని, కడెం, ఇతర వాగులు, వంకలు ఉప్పొంగడంతో గోదావరిలోకి భారీగా వరద వస్తోంది.
మేడిగడ్డ బ్యారేజీ నుంచి 5,11,080, సమ్మక్క బ్యారేజీ నుంచి 7,54,470, సీతమ్మసాగర్ నుంచి 10,49,351 క్యూసెక్కులను వదులుతు న్నారు. దీనికి స్థానిక వాగుల ప్రవాహం తోడై.. భద్రాచలం వద్ద ప్రవాహం బుధవారం రాత్రి 9.30 గంటలకు పదకొండున్నర లక్షల క్యూసెక్కులు దాటింది.
నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో వరద 48.4 అడుగులు దాటింది. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
పోలవరం వద్ద అలర్ట్: భద్రాచలం నుంచి వస్తున్న నీళ్లు, స్థానిక ప్రవా హాలు కలసి పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్న అధికారులు.. పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగు వకు వదిలేస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద బుధవారం రాత్రి 8 గంటలకు 8,37,850 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఇది గురువారం ఉదయం 10 గంటలకల్లా 12 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.
జూరాలకు పెరిగిన ఇన్‌ఫ్లో: కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణలో ఉన్న తొలి జలాశయం జూరాల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రాజె క్టుకు 30వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యు దుత్పత్తితో 29,641 క్యూసెక్కులు వదులుతు న్నారు. ఈ నీరంతా శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment