తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ మహాధర్నా | YSR Congress party Dharna for Samaikyandhra in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ మహాధర్నా

Published Sat, Aug 10 2013 12:08 PM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ మహాధర్నా - Sakshi

తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ మహాధర్నా

తిరుపతి : రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో మహాధర్నా చేపట్టింది. తిరుపతి నలుమూల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకారులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

 రాష్ట్రానికి కేంద్రం చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకే జనం ప్రభంజనంలా రోడ్లపైకి వస్తున్నారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. రాహుల్‌ను ప్రధానమంత్రిని చేయడానికే రాష్ట్ర విభజన చేపట్టారని దుయ్యబట్టారు. కపట నాటకాలు ఆడుతున్న టీడీపీ, కాంగ్రెస్‌లకు ప్రజలు చరమగీతం పాడుతారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement