వైఎస్ జగన్ సమైక్య శంఖారావం సభకు అనుమతి | Permission granted for YCP meeting at Hyd. | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 16 2013 2:33 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

ఈనెల 19న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ సభకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి అయిదు గంటల వరకూ సభ నిర్వహించుకోవచ్చని తెలిపింది. సమైక్య శంఖారావానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. డీసీపీ కమలాసన్ రెడ్డి ఉత్తర్వులను కొట్టివేసి, తమ సభకు అనుమతి మంజూరు చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఈరోజు ఉదయం తీర్పు వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement