'సీమాంధ్ర నేతల ఇళ్ళు ముట్టడించండి' | persuade Seemandhra leaders houses: Bhuma Nagireddy | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర నేతల ఇళ్ళు ముట్టడించండి'

Published Wed, Aug 7 2013 1:37 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

'సీమాంధ్ర నేతల ఇళ్ళు ముట్టడించండి'

'సీమాంధ్ర నేతల ఇళ్ళు ముట్టడించండి'

కర్నూలు: పదవులు పట్టుకుని వేలాడుతున్న సీమాంధ్ర నేతల ఇళ్లను ముట్టడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి....సమైక్యాంధ్ర జేఏసీ నేతలకు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక రాజధాని అడగటం సిగ్గు చేటు అని ఆయన మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా అందరూ సిద్ధపడాలని భూమా నాగిరెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి ఇప్పుడు ధర్నాలు చేయటం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. ఎమ్మినూరులో చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలకు దిగారు. మరోవైపు రాష్ట్ర విభజనను నిరసిస్తూ కర్నూలులో వందమంది యువకులు కొండారెడ్డి బురుజు ఎక్కారు. మరోవైపు సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆళ్లగడ్డ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement