సమైక్యాంధ్ర కోరుతూ విశాఖలో జర్నలిస్ట్‌లు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగదాంబ సెంటర్‌లో మానవహారం చేపట్టారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు స్వప్రయోజనం కోసం ఉద్యమాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని జర్నలిస్టులు ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా పాడేరులో కుల్గాంధీ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మరోవైపు విజయనగరం జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పార్వతీపురంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టింది. అలాగే సుమారు 15వేల మంది విద్యార్థులు రహదారిని దిగ్భందించి తమ నిరసనలు తెలిపారు. శ్రీకాకుళంలో గాయత్రి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పలాసలో న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ టెక్కలిలో సంపూర్ణ బంద్ కొనసాగుతుండగా, రణస్థలం మండల కేంద్రంలో సమైక్యవాదులు వంటావార్పు నిర్వహిస్తున్నారు.
Published Sat, Aug 17 2013 12:12 PM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM
Advertisement
Advertisement
Advertisement