vantavarpu
-
ఎంతో టేస్టీగా ఉండే మిల్లీ మేకర్ రోల్స్ చేసుకోండి ఇలా!
మీల్ మేకర్ రోల్స్ కావలసినవి: చపాతీలు– 5 (గోధుమ పిండిలో తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీలు చేసుకుని, వేయించి పక్కన పెట్టుకోవాలి) మీల్ మేకర్ – 2 కప్పులు (ముందుగా వేడినీళ్లలో వేసుకుని కాసేపు ఉంచి.. నీళ్లు వాడిన వెంటనే కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 నిమిషం పాటు అటూ ఇటూగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి) క్యాప్సికమ్, టొమాటో– 2 చొప్పున (ముక్కలు కట్ చేసుకోవాలి) ఉల్లిపాయలు– 2 (సగం గార్నిష్‌కి), పచ్చిమిర్చి– 4 (చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి) బ్రెడ్ పౌడర్, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, మిరియాల పొడి, జీలకర్ర పొడి – అర టీ స్పూన్ చొప్పున, పసుపు – చిటికెడు, టొమాటో కెచప్ – 1 టీ స్పూన్ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా నూనెలో సగం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాసేపు వేగించి.. అందులో పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, మీల్ మేకర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుని కూరలా దగ్గరపడే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత బ్రెడ్ పౌడర్, మొక్కజొన్న పిండి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, టొమాటో కెచప్ వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా కాల్చిన చపాతీలలో.. ఓవైపు ఈ కర్రీ వేసుకుని రోల్స్‌లా చుట్టుకోవాలి. మిగిలిన ఉల్లిపాయ ముక్కలతో వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. (చదవండి: వడలు పులుసుపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!) -
హోదా పోరు.. హోరెత్తిన ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు వెల్లువెత్తుతోంది. ఎంపీల దీక్షకు సంఘీభావం ప్రకటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు, వంటావార్పు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అంటూ నినదించారు. రాష్టానికి హోదా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి మెండితోక జగన్ మోహన్‌రావు ఆధ్వర్యంలో కృష్ణానదిలో జల దీక్ష నందిగామ గాంధీసెంటర్‌లో రిలే నిరాహార దీక్షలు కంచికచర్ల లో 65వ నంబర్ జాతీయ రహదారిపై వంట వార్పూ కార్యక్రమం విజయవాడ భవానీపురంలో వంటావార్పు కార్యక్రమం నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో రెండవ రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో 2వ రోజు రిలేదీక్షలు, వంటావార్పు కార్యక్రమం విశాఖపట్నం జిల్లా పాడేరు అంబేద్కర్ కూడలి వద్ద రెండవ రోజూ కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహారదీక్షలు అరకులో నియోజక కన్వీనర్ చెట్టిఫాల్గుణ ఆధ్వర్యంలో రెండవ రోజూ కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు ఇసుక తోట వద్ద వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వంశీకృష్ణ ఆధ్వర్యంలో వంటావార్పు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ కరపలో రెండవ రోజు కొనసాగుతున్న వైఎస్సార్ సీపీ రిలే నిరాహారదీక్షలు ఉప్పాడ సెంటర్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆద్వర్యంలో మూడో రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు, వంటావార్పు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద గలా వైఎస్ఆర్ సర్కిల్లో జిల్లా మహిళాధ్యక్షరాలు గాయాత్రిదేవి ఆధ్వర్యంలో అన్నదానం ప్రకాశం జిల్లా మార్కాపురం గడియార స్తంభం సెంటర్లో వైఎస్సార్ విగ్రహం ముందు వైఎస్సార్ సీపీ రైతు విభాగం నాయకుడు ఉడుములకోటిరెడ్డి ఆధ్వర్యంలోరిలే దీక్షలు ఒంగోలు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత ఆధ్వర్యంలో వంటావార్పు కోవూరు సమన్వయకర్త నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంటావార్పు.. లారీ డ్రైవర్లు, సిబ్బందికి భోజనం పెట్టిన నేతలు నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామీరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలు, డగదర్తి జాతీయ రహదారిపై బైఠాయింపు సూళ్లూరుపేట బస్ స్టాండ్ సెంటర్లో రెండో రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలు నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం గోపన్నపాలెంలో దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగిన రిలే నిరాహారదీక్షలు, వంటావార్పు ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉంగుటూరు సెంటర్లో రెండో రోజూ నిరాహార దీక్షలు గోపాలపురంలో నియోజకవర్గ కన్వీనర్ తరి వెంకట్రావు అద్వర్యంలో రిలే నిరాహార దీక్ష, వంటావార్పు అనంతపురం జిల్లా జిల్లా కలేక్టరేట్ వద్ద వంటావార్పు.. పాల్గొన్న అనంతపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురాం, పార్టీ నేతలు చవ్వారాజశేఖర్ రెడ్డి, అనంతచంద్రారెడ్డి గుంటూరు జిల్లా గుంటూరులో బస్తాలు ఎత్తుకుని విద్యార్థుల ఆందోళనలు పొన్నూరులో రిలే నిరాహారదీక్షలో కూర్చున్న నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ విజయనగరం జిల్లా విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం.. హాజరైన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి, పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ నాయకులు పిల్లా విజయకుమార్, యడ్ల రమణమూర్తి పార్వతీపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగారావు, బొబ్బిలిలో సమన్వయకర్త డాక్టర్ పోలా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో రెండోవ రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు, పటేల్ కూడలిలో వంటావార్పు కార్యక్రమం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష -
‘మహాప్రభో..మా గోడు వినండి’
– నిరవధిక సమ్మెలో ఏజీ వర్సిటీ టైమ్‌స్కేల్ ఉద్యోగులు – రెగ్యులరైజేషన్, హెచ్ఆర్ఏల ఊసెత్తని ప్రభుత్వం – డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమణ సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కేంద్రాల్లో పనిచేసే టైమ్‌స్కేల్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గడచిన నెల రోజులుగా వీరు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నెల రోజుల్లోగా డిమాండ్లను పరిష్కరిస్తామన్న వర్సిటీ అధికారులు మళ్లీ ఉద్యోగుల ముఖం చూసింది లేదు. దీంతో టైమ్‌స్కేల్ ఉద్యోగులంతా డిమాండ్ల సాధన కోసం రోజుకో పద్దతిలో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం 900 మంది టైమ్‌స్కేల్ ఉద్యోగులున్నారు. వీరంతా మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉద్యోగాల్లో నియమితులైన వారే. అప్పట్లో మొత్తం 1650 మంది ఉద్యోగాల్లో చేరగా, 2014 నాటికి 900 మంది మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. మిగతా వారంతా ఉద్యోగ విరమణ చేశారు. ప్రభుత్వం వీరికి మూలవేతనం, డీఏలను మాత్రమే చెల్లిస్తోంది. ఇవి రెండూ కలిపి ఒక్కొక్కరికీ నెలకు రూ. 14 వేల వరకూ అందుతున్నాయి. వీరి నియామకాల సమయంలో హెచ్ఆర్ఏ, సిటీ అలవెన్సులపై ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంతేకాకుండా జీవో నెంబరు 119 కింద వీరి ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా వీరి సమస్యలపై స్పందించనే లేదు. ఇప్పటికి పలు మార్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు, వర్సిటీ రిజిస్ట్రార్ టీవీ సత్యనారాయణలను కలిసిన టైమ్‌స్కేల్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. వారి నుంచి సరైన స్పందన కరువవడంతో గుంటూరులోని వర్సిటీ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. గుంటూరు,తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, కడప, కర్నూలుల్లో వర్సిటీ పరిధిలోని టైమ్‌స్కేల్ ఉద్యోగులు రోజుకో విధంగా నిరసనలు, ఆందోళనలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని యూనివర్సిటీ టైమ్‌స్కేల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పీ మురళీ కోరుతున్నారు. -
25వ రోజూ హోరెత్తిన నిరసనలు
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యమం వాడవాడలా ఉధృతంగా సాగుతోంది. జిల్లాలో వరుసగా 25వ రోజున పోరు హోరెత్తింది. గుడివాడ పట్టణంలోని కళాకారులు చిత్రవిచిత్ర వేషధారణలతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. వంటావార్పు చేసి తమ నిరసన తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నందివాడ మండలం జనార్థనపురంలో మానవహారం నిర్వహించి వంటావార్పు చేశారు. ఉద్యోగ సంఘాల కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. పామర్రులో, పెదపారుపూడి సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. విస్సన్నపేటలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏడోరోజు రిలేదీక్షలు కొనసాగాయి. ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 3వ రోజు చేరాయి. కొర్లమండలో గ్రామస్తులు రాస్తారోకో చేశారు. జయంతిపురంలో హతిరామ్ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ, మానవహారం కార్యక్రమాలు గ్రామస్తులతో కలిసి నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో కొవ్వొత్తుల ప్రదర్శన.. ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నూజివీడులో హౌసింగ్ అధికారులు బైక్ ర్యాలీ జరిపారు. జగన్ దీక్షలకు మద్దతుగా పార్టీ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో పెడనలో రిలేదీక్షలు జరిగాయి. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో జేఏసీ నాయకులు చెవిలో పూలు పెట్టుకుని జాతీయ రహదారిపై మోకాళ్లపై నడుస్తూ వినూత్న ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేటలో మహిళలు బోనాలతో నిరసన తెలిపారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన రిలే దీక్షలను విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సందర్శించి మద్దతు తెలిపారు. పాత మున్సిపల్ సెంటర్లో సమైక్యాంధ్రవాదులు క్రికెట్, కర్రసాము, వెయిట్‌లిఫ్టింగ్, కబడ్డీ వంటి ఆటలు ఆడి నిరసన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలులో యూత్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కలిదిండి సెంటరులో సమైక్యాంధ్రకు మద్దతుగా కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. వాగ్దేవి జూనియర్, డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థినులు మున్సిపల్ కూడలిలో కుంటుతూ తమ నిరసన తెలిపారు. గుడివాడలో కూచిపూడి నృత్యకారుల ఆధ్వర్యంలో నెహ్రూచౌక్ వద్ద నత్యం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బొబ్బర్లంక దళితవాడ యువకులు మండల పరిధిలోని కొక్కిలిగడ్డ వంతెన వద్ద కరకట్ట డబుల్‌లైన్ రహదారిపై ఆందోళన నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. నూజివీడులో హౌసింగ్ అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని రైతు నాయకుడు యెర్నేని నాగేంద్రనాధ్ సందర్శించారు. కోడూరు మండలం విశ్వనాథపల్లిలో పార్టీలకతీతంగా పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు దీక్షలు జరిపారు. మోపిదేవి మండలం కె.కొత్తపాలెం, అవనిగడ్డ మండలం వేకనూరులో విద్యార్థులు ర్యాలీలు చేశారు. వీరులపాడు, అల్లూరు, జయంతి, జుజ్జూరు, కొణతాలపల్లి గ్రామాల్లో ఆదివారం సమైక్య నిరసనలు జరిగాయి. వినూత్న నిరసనలు.. కంచికచర్లలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కేవీఆర్ కళాశాల నుంచి ర్యాలీగా రైతుపేట వచ్చి 65వ నంబర్ జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రహదారిపై మోకాళ్లతో నడవటం, యోగాసనాలు, పలు ఆటలు ఆడి నిరసన తెలిపారు. మచిలీపట్నంలో జిల్లాకోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు, కోర్టు గుమాస్తాల సంఘం ప్రతినిధులు మోకాళ్లపై నిలబడి, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టారు. కైకలూరులో ఎన్జీవోలు, ఉపాధ్యాయులు తాలుకాసెంటర్లోవద్ద పామర్రు - కత్తిపూడి జాతీయరహదారిపై సూర్య నమస్కారాలు చేశారు. కంకిపాడు, గన్నవరం రోడ్డు కూడళ్లలో రజకులు రోడ్డు పైనే చాకిరేవు ఏర్పాటు చేసి బట్టలు ఉతికి, ఆర వేసి తమ నిరసన తెలిపారు. ఉయ్యూరులో ఉద్యోగులు, సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు ప్రధాన సెంటర్లోని రింగ్‌లో మొక్కలు నాటి, రోడ్డుపై వెళ్లే ఆటోల అద్దాలు తుడిచి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చల్లపల్లిలో టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 216 జాతీయరహదారిపై టైలర్లు దుస్తులు కుట్టి నిరసన తెలిపారు. విజయవాడలో భారీ ప్రదర్శనలు.. విజయవాడలో దుర్గగుడి ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు. ఆదివారం రిలేదీక్షలు ప్రారంభించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తెలుగువారే కాకుండా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా సమైక్యం కోసం ఉద్యమిస్తున్నారు. లయోలా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలలో రాజస్తానీ మార్వాడీలు పాల్గొన్నారు. విజయవాడ సింధీ సమాజం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అకాడమీ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ సంగీత కళాశాలలో సమైక్యాంధ్రపై నిర్వహించిన చిత్ర కళా పోటీల్లో కార్టూనిస్టులు పాల్గొని పలు చిత్రాలను గీశారు. మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. విద్యార్థులు రోడ్డుపైనే ఆల్పాహారం తీసుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆటోనగర్‌లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ దీక్షలకు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం కన్వీనర్ తాతినేని పద్మావతి సంఘీభావం ప్రకటించారు. అనంతరం సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. -
సమైక్యం కోసం విశాఖలో జర్నలిస్టుల ర్యాలీ
-
సమైక్యాంధ్ర కోసం విశాఖలో జర్నలిస్టుల ర్యాలీ
విశాఖ : సమైక్యాంధ్ర కోరుతూ విశాఖలో జర్నలిస్ట్‌లు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగదాంబ సెంటర్లో మానవహారం చేపట్టారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు స్వప్రయోజనం కోసం ఉద్యమాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని జర్నలిస్టులు ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా పాడేరులో కుల్గాంధీ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మరోవైపు విజయనగరం జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పార్వతీపురంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టింది. అలాగే సుమారు 15వేల మంది విద్యార్థులు రహదారిని దిగ్భందించి తమ నిరసనలు తెలిపారు. శ్రీకాకుళంలో గాయత్రి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పలాసలో న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ టెక్కలిలో సంపూర్ణ బంద్ కొనసాగుతుండగా, రణస్థలం మండల కేంద్రంలో సమైక్యవాదులు వంటావార్పు నిర్వహిస్తున్నారు. -
జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సోమవారం స్థానిక రివర్వ్యూ కాలనీలోని కేంద్ర రైల్వేసహాయశాఖ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి ఇంటి సమీపంలో రాయలసీమ ఉద్యోగ, ఉపాధ్యాయ అధ్యాపక ఐక్యకార్యాచరణ సమాఖ్య(జేఏసీ) చైర్మన్ డాక్టర్ కె.చెన్నయ్య ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా కోట్ల ఇంటి ఎదురుగానే వంటావార్పు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అక్కడికి వెళ్లిన జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోట్ల ఇంటికి సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద వంటావార్పు నిర్వహించారు. కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ పి.లింగేశ్వరరెడ్డి, నాయకులు సుంకన్న, ప్రభు, అంజనయ్య, ప్రతిమారాయ్, షీలాసౌజన్య, రాంప్రసాద్, లలితమ్మ, హేమలత, లాలప్ప, గాంధీ తదితరులు పాల్గొన్నారు.