Journalists rally
-
ర్యాలీలు, మానవహారాలు
ఏపీలో ‘సాక్షి’ ప్రసారాల నిలిపివేతపై పెల్లుబికిన ప్రజాగ్రహం సాక్షి నెట్వర్క్: నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, వాస్తవాలను ప్రతిబింబిస్తున్న తెలుగువారి మనస్సాక్షి.. సాక్షి టీవీ చానల్ ప్రసారాలను ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారు అన్యాయంగా నిలిపివేయడంపై ఆగ్రహం ఉధృతమైంది. ఆరో రోజైన మంగళవారం జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపి టీడీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో సాక్షి చానల్ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా ప్రదర్శనలు నిర్వహించారు. ధర్నాలు, మానవహారాలు చేపట్టారు. హైదరాబాద్‌లో నేడు జర్నలిస్టుల ర్యాలీ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా హైదరాబాద్‌లో జర్నలిస్టులు బుధవారం ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10.45 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం ర్యాలీగా రాజ్‌భవన్‌కు వెళ్లి సాక్షి ప్రసారాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పిస్తారు. -
సమైక్యం కోసం విశాఖలో జర్నలిస్టుల ర్యాలీ
-
సమైక్యాంధ్ర కోసం విశాఖలో జర్నలిస్టుల ర్యాలీ
విశాఖ : సమైక్యాంధ్ర కోరుతూ విశాఖలో జర్నలిస్ట్‌లు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగదాంబ సెంటర్లో మానవహారం చేపట్టారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు స్వప్రయోజనం కోసం ఉద్యమాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని జర్నలిస్టులు ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా పాడేరులో కుల్గాంధీ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మరోవైపు విజయనగరం జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పార్వతీపురంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టింది. అలాగే సుమారు 15వేల మంది విద్యార్థులు రహదారిని దిగ్భందించి తమ నిరసనలు తెలిపారు. శ్రీకాకుళంలో గాయత్రి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పలాసలో న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ టెక్కలిలో సంపూర్ణ బంద్ కొనసాగుతుండగా, రణస్థలం మండల కేంద్రంలో సమైక్యవాదులు వంటావార్పు నిర్వహిస్తున్నారు. -
జర్నలిస్టుల సమితి ఆధ్వర్యంలో రేపు భారీ ర్యాలీ
విశాఖ: సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ సోమవారం జర్నలిస్టుల సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కేంద్రం తెలంగాణకు ప్రకటన చేసిన నేపథ్యంలో సీమాంధ్రలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి, గత కొన్నిరోజులుగా సీమాంధ్ర జిల్లాలో ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. నిరసనలో భాగంగా జర్నలిస్టుల సమితి అధ్వర్యంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. ఈ ర్యాలీకి భారీగా సమైక్యాంధ్ర వాదులు తరలివచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా, ఆదివారం శ్రీకాళహస్తిలో సీమాంధ్ర జేఏసీ లక్ష దీపాలంకారణ నిర్వహించింది.