విశాఖ: సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ సోమవారం జర్నలిస్టుల సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కేంద్రం తెలంగాణకు ప్రకటన చేసిన నేపథ్యంలో సీమాంధ్రలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి, గత కొన్నిరోజులుగా సీమాంధ్ర జిల్లాలో ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. నిరసనలో భాగంగా జర్నలిస్టుల సమితి అధ్వర్యంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. ఈ ర్యాలీకి భారీగా సమైక్యాంధ్ర వాదులు తరలివచ్చే అవకాశం ఉంది.
రేపటి నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా, ఆదివారం శ్రీకాళహస్తిలో సీమాంధ్ర జేఏసీ లక్ష దీపాలంకారణ నిర్వహించింది.