సమైక్యాంధ్ర కోసం ఉధృతంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాజకీయక కుట్ర జరుగుతోందని ప్రభుత్వ వైద్యుల సంఘం నేత శ్యాంసుందర్ ఆరోపించారు. ఉద్యోగ సంఘాల సమ్మె విరమణ ఆ వ్యూహంలో భాగమేనని, తాము మాత్రం సమ్మెను ఉధృతం చేయడానికి తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
మొదట్నుంచి రాజకీయాలకు అతీతంగా మెడికల్ జేఏసీ ఉద్యమాలు కొనసాగిస్తోందని, ఈ రోజు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు కొంతమంది సమ్మెలు విరమించామంటున్నారు గానీ తాము మాత్రం ఆ హామీలను నమ్మేది లేదని స్పష్టం చేశారు. విభజనను విరమణకు సానుకూలంగా ఒక ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వరకు సమ్మె విరమించబోమని తెలిపారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఉన్న పీహెచ్సీలు, సీహెచ్సీలు, బోధనాస్పత్రులు, ఏరియా ఆస్పత్రులలో ఓపీ, ఆపరేషన్లు బహిష్కరిస్తామని డాక్టర్ శ్యాంసుందర్ తెలిపారు.
ముఖ్యమంత్రి హామీలను నమ్మేది లేదు: మెడికల్ జేఏసీ
Published Fri, Oct 18 2013 11:22 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement