చివరియత్నం చేస్తాం: పురందేశ్వరి | Last attempt for United Andhra Pradesh: daggubati Purandeswari | Sakshi
Sakshi News home page

చివరియత్నం చేస్తాం: పురందేశ్వరి

Published Sun, Nov 17 2013 8:38 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

చివరియత్నం చేస్తాం: పురందేశ్వరి - Sakshi

చివరియత్నం చేస్తాం: పురందేశ్వరి

విశాఖపట్టణం: సమైక్యాంధ్ర కోసం జీవోఎమ్ సమావేశంలో చివరియత్నం చేస్తామని కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. జీవోఎమ్ ముందు తమ వాదనలు సమర్థవంతంగా విన్పిస్తామని ఆమె అన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వాదనలు విన్పిస్తామన్నారు.

గతంలో పదవులకు రాజీనామాలు చేశామని, ఇక చేయాల్సింది ఏమీ లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. బ్రస్ట్ కేన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో నిర్వహించిన పింక్ రిబ్బన్ వాక్ను ఈ ఉదయం పురందేశ్వరి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో విశాఖ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement