మంత్రులు రాజీనామాలతో సమస్యకు పరిష్కారం లభించదని కేంద్ర సహాయ మంత్రి జేడీ శీలం అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ: మంత్రులు రాజీనామాలతో సమస్యకు పరిష్కారం లభించదని కేంద్ర సహాయ మంత్రి జేడీ శీలం అభిప్రాయపడ్డారు. రాజీనామాలు చేస్తే ఇక్కడ పనిచేసే వాళ్లు ఎవరని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యలను బ్యాలెన్సుడుగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని జేడీ శీలం తెలిపారు. రైతులు, హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణపై ప్రస్తుతం తాము దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఓ దశలో సీమాంధ్ర నేతలు రాజీనామాల బెదిరింపులపై ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. సమస్యలు వీధుల్లో పరిష్కారం కావని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర నేతలు లేవనెత్తిన అంశాలపై ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ సలహాదారు దిగ్విజయ్ సింగ్‌లను కలిసి వివరిస్తానని ఆయన తెలిపారు.