విజయనగరం : సమైక్యాంధ్రపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన వైఖరిని బయటపెట్టాలని మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కూడా సమైక్యాంధ్రపై తన వైఖరిని తెలియ చేశారని ఆయన సోమవారమిక్కడ అన్నారు. బొత్స ఇప్పటికైనా నోరు విప్పాలని, లేకుండా ఆయన ఇంటిని ముట్టడిస్తామని గద్దె బాబూరావు హెచ్చరించారు. మరోవైపు సమైక్యవాదులు చీపురుపల్లిలోని మూడురోడ్ల జంక్షన్లో కేసీఆర్ పేరుతో బెల్టుషాపును ఓపెన్ చేసి తమ నిరసన తెలిపారు.
కాగా విజయనగరం జిల్లా పూసపాటిరేగలో నిరసన కార్యక్రమాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా ప్రమాదవశాత్తూ రాములప్పుడు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
'బొత్స కూడా తన వైఖరిని బయటపెట్టాలి'
Published Mon, Aug 12 2013 10:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
Advertisement
Advertisement