Gadde Baburao
-
'బాబు ఎవరినైనా వాడుకుని వదిలేస్తారు'
సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పిన విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ విప్ గద్దె బాబూరావు శనివారం బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఏపీ సహ ఇంచార్జి సునీల్ దేవధర్ సమక్షంలో బాబూరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మీడియాతో మట్లాడుతూ... రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీలో చేరాలని పిలుపునిస్తున్నాను. ఎన్టీఆర్ కుమార్తె పురంధ్రేశ్వరికి పార్టీ కేంద్ర కమిటీలో స్థానం కలిపించారు. చంద్రబాబు ఎవ్వరినైనా వాడుకుని వదిలేస్తారు. గత ఎన్నికల్లో తనకు అనుకూలమైన వ్యక్తులకు సీటివ్వలేదని పోత్తును వదులుకున్నటు చంద్రబాబు ప్రకటించాడు. మళ్లీ సాయంత్రమే కాళ్లబేరానికొచ్చాడు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని వాడుకున్నాడు, మోసగించాడు, వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేయగలడు..? నిర్మాణమైన ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా పోషించలేకపోతున్నారు. బీజేపీ జాతీయ పార్టీ. మోడీ ఇజమ్.. ఎన్టీఆర్ విధానాలను ఇప్పుడు బీజేపీ అనుమతిస్తోంది. (అందుకే పార్టీకి రాజీనామా : గద్దె బాబూరావు) హుద్ హూద్ సమయంలో కింజరపు అచ్చెన్నాయుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువుల పూడికలో అడ్డగోలుగా దోచేశారు. బాత్రూమ్ కట్టడంలో కూడా అవకతవకలకు పాల్పడి ఆ నిధులు కూడా తెలుగు దేశం పార్టీ నాయకుల జోబుల్లోకే వెళ్లాయి. చంద్రబాబు సొంత మండలంలో కూడా నిర్మాణాలు చేపట్టకుండానే నిధులన్నీ దోచేశారు. గతంలో చినరాజప్పకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినా మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా చేశారు అని సోమువీర్రాజు విమర్శలు గుప్పించారు. (లక్ష్మీపతిరాజాపై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ) -
టీడీపీలో గర్జించిన అసమ్మతి
సాక్షి, విజయనగరం: తెలుగుదేశం పార్టీలో వెన్నుపోటు కొత్తేం కాదు.. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి వరకు ఆ పార్టీ ముఖ్య నేతలు, సీనియర్లు వెన్నుపోట్లుకు గురవుతూనే ఉన్నారు. తాజాగా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున నియామకంపై టీడీపీలో అసమ్మతిసెగలు భగ్గుమంటున్నాయి. తనను అధ్యక్షుడిగా నియమించకపోవడంపై గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన కార్యాలయానికి పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంగా బోర్డుపెట్టి మరీ ఆయన నిరసన తెలిపారు. కార్యకర్తలతో తన కార్యాలయంలో ఆదివారం హుటాహుటిన సమావేశయ్యారు. పార్టీని నమ్ముకున్న తమకు అధిష్టానం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జూనియర్‌కి అధ్యక్ష పదవి ఇచ్చి సీనియర్లను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం పెట్టి మరీ టీడీపీ అగ్రనాయకత్వాన్ని ఏకిపారేశారు. అప్పటిలో శ్రీకాకుళం, విజయనగరం ఎమ్మెల్యే స్థానాల బి.ఫారాలు ఎన్టీఆర్ తన చేతికే ఇచ్చేవారని, అప్పటి పార్టీకి, ఇప్పటి పార్టీకి చాలా తేడాలు ఉన్నాయన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు గద్దె ఉన్నడో లేడో కూడా టీడీపీ నాయకత్వం గుర్తించడం మనేసిందని, ఆత్మ గౌరవం, ఆత్మ సంతృప్తి కోల్పోయి పారీ్టకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. (అలా మొక్కారు.. ఇలా తొక్కారు!) అసమ్మతికి చిహ్నంగా మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు తన కార్యాలయానికి ఏర్పాటుచేసిన పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయం బోర్డు అశోక్‌కూ తప్పని భంగపాటు... తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు గత ఎన్నికల్లో తన కుమార్తెను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేక, తను ఎంపీగా గెలవలేక ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అదే ఆయన కుమార్తెకు పదవి రాకుండా చేసింది. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలిగా తన కుమార్తె అధితి గజపతిరాజుని చూడాలని ప్రయత్నించిన అశోక్ మళ్లీ భంగపడ్డారు. పార్టీలో నంబర్–2గా ఒక వెలుగు వెలిగిన అశోక్ గజపతి ప్రాభావం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనడానికి ఇదొక ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి, అశోక్‌కు మధ్య దూరం పూడ్చలేనంతగా పెరిగిపోయింది. తాజాగా తన కుమార్తెకు సైతం పదవి రాకపోవడంపై అశోక్ మరింత అసంతృప్తికి గురైనట్టు సమాచారం. పార్టీ నేతలెవరితోనూ మాట్లాడేందుకు సైతం ఇష్టపడడం లేదని ఆ పార్టీ జిల్లా నేతలే చెబుతున్నారు. (అచ్చెన్నపై యూటర్న్) సంధ్యారాణికి ప్రాధాన్యం... ఎన్ని విమర్శలు ఎదురైనా గుమ్మడి సంధ్యారాణికి చంద్రబాబు మరోసారి పదవిని కట్టబెట్టారు. సాలూరులో సీనియర్ నేతగా ఉన్న భంజ్‌దేవ్‌కు, సంధ్యారాణికి మధ్య విభేదాలు గత ఎన్నికలలో తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైన భంజ్‌దేవ్‌ను కాదని సంధ్యారాణికి అరకు పార్లమెంట్ అధ్యక్ష పదవిని ఇవ్వడంతో భంజ్దేవ్వర్గం ఆగ్రహంగా ఉంది. ఓ వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గంగా ముద్రపడిన కె.ఎ.నాయుడు, మీసాల గీత వంటి వారిని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే, వారసత్వ రాజకీయాలకు నేను ప్రాధాన్యం ఇవ్వను అంటూనే మాజీ మంత్రి కుమారుడికి పదవిని ఇవ్వడంపై నేతల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ముందు నిలువలేక చతికిలపడ్డ టీడీపీ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలతో పాటు విజయనగరం, అరకు, విశాఖ పార్లమెంట్ స్థానాలు సైతం కోల్పో యింది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురైపోయారు. కొత్త నాయకత్వంతో నైనా పారీ్టపైకి లేస్తుందేమోనని భావిస్తున్న వారికి తాజా పరిణామాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. మొత్తం మీద టీడీపీ కార్యవర్గ పదవుల కేటాయింపు జిల్లాలో ఆ పార్టీకి మరోసారి తీవ్ర నష్టాన్ని కలిగించేలా ఉంది. -
తెలుగుదేశం పార్టీకీ మరో ఎదురు దెబ్బ
-
అందుకే పార్టీకి రాజీనామా : గద్దె బాబూరావు
సాక్షి, విజయనగరం : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రకటన చేశారు. గద్దె బాబూరావు మీడియాతో మాట్లాడుతూ... ‘పార్టీలో పరిస్థితులు బాగోలేదు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు లేదు. ఆత్మ గౌరవం.. ఆత్మ స్థైర్యంతో పుట్టిన పార్టీ ప్రస్తుతం కరుమరుగైంది. అందుకే రాజీనామా చేస్తున్నా. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీ వేరు. చంద్రబాబు నాయుడు మాలాంటి వారికి గౌరవం ఇవ్వడం లేదు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. 1978లో నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను. కాంగ్రెస్‌లో ఉన్న నేను, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీలో చేరారు. అక్కడ నుంచి ఆయన అడుగు జాడల్లో నడిచాను. చీపురుపల్లి ప్రజల సహకారంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. పార్టీ కోసం అంకిత భావంతో పని చేశాను. అప్పట్లో ఎన్టీఆర్ శ్రీకాకుళం, విజయనగరం ఎమ్మెల్యే స్థానాల బీ ఫారాలు నా చేతికే ఇచ్చేవారు. కానీ అప్పటి టీడీపీకి ఇప్పటి టీడీపీకి చాలా తేడాలు వచ్చాయి. 2004 నుంచి ఇప్పటివరకూ గద్దె బాబూరావు ఉన్నాడో లేడో కూడా టీడీపీ నాయకత్వం గుర్తించడం మానేసింది. నాకు ఎవరి మీద విమర్శలు చేయడం ఇష్టం లేదు. ఆత్మ గౌరవము, ఆత్మ సంతృప్తి కోల్పోయిన తర్వాత చాలా బాధ కలిగి ఇవాళ టీడీపీకి రాజీనామా చేస్తున్నా. నాకు ఎంతో గౌరవం ఇచ్చిన పార్టీలో నేడు గుర్తించే వారు లేకపోవడం నాకు చాలా బాధ కల్గించింది. ఎంతోమంది నచ్చజెప్పారు కానీ నా రాజీనామా నిర్ణయం మార్చుకోదల్చుకోలేదు.’ అని స్పష్టం చేశారు. కాగా గద్దె బాబూరావు ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా పని చేశారు. ఎన్టీఆర్‌తో గద్దె బాబూరావు (ఫైల్ ఫోటో) -
'బొత్స కూడా తన వైఖరిని బయటపెట్టాలి'
విజయనగరం : సమైక్యాంధ్రపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన వైఖరిని బయటపెట్టాలని మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా సమైక్యాంధ్రపై తన వైఖరిని తెలియ చేశారని ఆయన సోమవారమిక్కడ అన్నారు. బొత్స ఇప్పటికైనా నోరు విప్పాలని, లేకుండా ఆయన ఇంటిని ముట్టడిస్తామని గద్దె బాబూరావు హెచ్చరించారు. మరోవైపు సమైక్యవాదులు చీపురుపల్లిలోని మూడురోడ్ల జంక్షన్లో కేసీఆర్ పేరుతో బెల్టుషాపును ఓపెన్ చేసి తమ నిరసన తెలిపారు. కాగా విజయనగరం జిల్లా పూసపాటిరేగలో నిరసన కార్యక్రమాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా ప్రమాదవశాత్తూ రాములప్పుడు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.