
మదనపల్లిలో లక్ష గర్జన సమర భేరి
మదనపల్లి : సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో లక్ష గర్జన సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు సమీపంలోని అనిబిసెంట్ సర్కిల్ వద్ద లక్ష గర్జన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు సమైక్యవాదులు పాల్గొన్నారు. లక్షసార్లు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేపట్టారు. అలాగే బెంగళూరు రోడ్డు, మల్లికార్జున సర్కిల్, పటేల్ రోడ్డులను దిగ్బంధం చేశారు.
ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు జేఏసీ నేతలు, ఆర్టీసీ, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, మహిళ సంఘాలు, ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలలు, వ్యాపారులు, రైతులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.