హైదరాబాద్:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై దాడి వీరభద్రరావు మరోసారి మండిపడ్డారు. పార్లమెంట్ లో తెలుగుదేశం సభ్యులు ఆడుతున్న నాటకానికి సూత్రధారి చంద్రబాబేనన్నారు. లోక్ సభలో సోమవారం టీడీపీ సభ్యలు సృష్టించిన గందరగోళాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం మరోసారి బయటపడిందని వైఎస్సార్ సీపీ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. లోక్ సభ, రాజ్యసభలో టీడీపీ నేతలను రెండుగా విడగొట్టి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని దాడి మండిపడ్డారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పదవులకు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాలని ఆయన సూచించారు. ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం వస్తేనేగాని విభజన నిర్ణయం ఆగదని దాడి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటుందని తెలిపారు.