సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీ నామాలు అవసరం లేదు | no pressure on seemandhra leaders, says jc diwakar reddy | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీ నామాలు అవసరం లేదు

Published Mon, Sep 23 2013 2:51 PM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM

సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీ నామాలు అవసరం లేదు

సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీ నామాలు అవసరం లేదు

హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు అవసరం లేదని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాల చేసినంత మాత్రాన యూఏపీ ప్రభుత్వం పడిపోదని ఆయన తెలిపారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల రాజీనామాల అంశం తెరపైకి వచ్చిన నేపధ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కొందరు ఎంపీలు రాజీనామాలు చేసినంత మాత్రాన యూపీఏకు ఎటువంటి ఢోకాలేదని ఆయన భరోసా ఇచ్చారు.

 

ఇతర సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై రాజీనామా ఒత్తిడి ఉండదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్లమెంటులో విభజన బిల్లు, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఓడించడానికి  సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా పదవుల్లో కొనసాగాల్సిన అవసరం ఉందని జేసీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement