విభజన బిల్లుపై రాష్ట్రపతి ఆదేశం మేరకు అసెంబ్లీని సమావేశపరిచే అధికారం గవర్నర్దే అని ప్రభుత్వ విప్ అనిల్ స్పష్టం చేశారు.
విభజన బిల్లుపై రాష్ట్రపతి ఆదేశం మేరకు అసెంబ్లీని సమావేశపరిచే అధికారం గవర్నర్దే అని ప్రభుత్వ విప్ అనిల్ స్పష్టం చేశారు. ఆ విషయంలో సీఎం కిరణ్, స్పీకర్ నాదెండ్ల మనోహర్లు నిమిత్తమాత్రులేని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో మాట్లాడుతూ... అసెంబ్లీలో తెలంగాణ బిల్లు అడ్డుకుంటామని ప్రగల్బాలు పలికిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పడు ప్రొరోగ్ పేరుతో రాజకీయాలు చేస్తు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పరంగా సంక్రమించిన స్పీకర్ స్థానాన్ని రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయాల్లోకి లాగడం సరికాదని అనిల్ అభిప్రాయపడ్డారు.