తీర్మానం ఓడించేవరకు రాజీనామాలు చేయం: గంటా | No resignations until we defeat the t-resolution, say seemandhra congress ministers | Sakshi
Sakshi News home page

తీర్మానం ఓడించేవరకు రాజీనామాలు చేయం: గంటా

Published Fri, Oct 4 2013 3:00 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

తీర్మానం ఓడించేవరకు రాజీనామాలు చేయం: గంటా - Sakshi

తీర్మానం ఓడించేవరకు రాజీనామాలు చేయం: గంటా

హైదరాబాద్ : తెలంగాణపై అసెంబ్లీకి తీర్మానం వచ్చేవరకూ రాజీనామాలు చేయరాదని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. తెలంగాణ నోట్పై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పదవుల్లో కొనసాగుతూ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు.

సమావేశం  అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం రాకుండా పోదని.... తీర్మానం వస్తే ఓడించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత రాష్ట్రాల సంప్రదాయం ప్రకారం అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తుందన్నారు. ఒకవేళ రాకుంటే రాష్ట్రపతిని కలవనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement