ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు. తెలంగాణ విషయమై అప్పుడే ఏమీ మాట్లాడవద్దని తాను ముఖ్యమంత్రికి చెప్పినట్లు లగడపాటి ఆ తర్వాత విలేకరులకు తెలిపారు.
తెలంగాణ బిల్లుపై చర్చకు పొడిగింపు వస్తుందా, లేదా అనే విషయం ఈరోజు సాయంత్రం 4 గంటలకల్లా తెలుస్తుందని, పొడిగించాల్సిన గడువు వారమా, రెండు వారాలా అన్న మీమాంస మాత్రమే ఇప్పుడు నడుస్తోందని లగడపాటి అన్నారు. ముందు ఒక వారం, తర్వాత ఇంకోవారం పొడిగించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పొడిగింపు రాకుంటే.. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభించాలనిని కోరినట్లు రాజగోపాల్ తెలిపారు.