రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు.
రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. గురువారం రాష్ట్రపతి భవన్లో ప్రణబ్తో అరగంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 30 మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గతంలో రాష్ట్రాలను విభజించినపుడు పాటించిన పద్ధతిని ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రపతికి విన్నవించినట్టు భేటి అనంతరం నాయకులు చెప్పారు. రాజ్యాంగానికి విరుద్ధంగా విభజన జరుగుతోందని తెలియజేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని రాష్ట్రపతికి విన్నవించినట్టు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు చెప్పారు.