కేబినెట్లో మరోసారి తెలంగాణ బిల్లుపై చర్చ: షిండే | we will discuss telangana bill again in cabinet, say Sushil kumar Shinde | Sakshi
Sakshi News home page

కేబినెట్లో మరోసారి తెలంగాణ బిల్లుపై చర్చ: షిండే

Published Thu, Dec 12 2013 10:40 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

కేబినెట్లో మరోసారి తెలంగాణ బిల్లుపై చర్చ: షిండే - Sakshi

కేబినెట్లో మరోసారి తెలంగాణ బిల్లుపై చర్చ: షిండే

న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో నిర్ణయం రాగానే తిరిగి బిల్లు కేంద్రానికి చేరుతుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కేబినెట్లో మరోసారి బిల్లుపై చర్చిస్తామన్నారు. ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడతామని షిండే తెలిపారు.

కాగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును-2013 రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్రమంత్రి మండలి ఆమోద ముద్ర వేసి పంపిన విభజన బిల్లుపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత...శాసనసభ, శాసనమండలి అభిప్రాయం కోరుతూ దాన్ని యథాతథంగా రాష్ట్రానికి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement