
'తెలంగాణ ఆవిర్భావ తేదీపై దృష్టి పెట్టాం'
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం షిండే మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ తేదీపై దృష్టి పెట్టామన్నారు. గవర్నర్ నరసింహన్ పంపిన నివేదిక ఇంకా తమకు అందలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలా.... లేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు విషయంపై చర్చించేందుకు కమల్ నాథ్ కూడా సోనియాగాంధీతో విడిగా సమావేశం అయ్యారు .