
అల్లర్ల వెనక రాజకీయ పార్టీల పాత్ర: షిండే
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ అల్లర్ల వెనక రాజకీయ పార్టీల పాత్ర ఉందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ అల్లర్ల వెనక రాజకీయ పార్టీల పాత్ర ఉందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. ముజఫర్ నగర్ అల్లర్లలో మృతి చెందినవారి సంఖ్య 48కి చేరిన విషయం తెలిసిందే. కాగా అల్లర్లను అదుపు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించనున్నట్లు షిండే తెలిపారు.
ముజఫర్నగర్లో శనివారం చోటు చేసుకున్న అల్లర్లలో దాదాపు 48 మంది మరణించగా, మరో 1000 మంది వరకు గాయపడ్డారు. అల్లర్లపై ఎస్పీ అధినేత ములాయం సింగ్ తన కుమారుడు అఖిలేష్కు క్లీన్ చీట్ ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.