
'తెలంగాణ బిల్లా.. తీర్మానమా.. షిండేతో మాట్లాడి చెబుతా'
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు పంపాలా లేక తీర్మానమా అన్న విషయాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడాక స్పందిస్తానని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి దిగ్విజయ్ ప్రకటించారు. షిండేతో మాట్లాడిన తర్వాత అన్ని విషయాలు వివరిస్తానని చెప్పారు.
బిల్లు విషయంలో ఏఐసీసీ నాయకులు భిన్నమైన ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు తెలంగాణ ఏర్పాటవుతుందన్న కాంగ్రెస్ నేత చాకో వ్యాఖ్యలతో తనకు సంబంధంలేదని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు.