' ప్రజలు మమ్మల్ని తిరస్కరించినా.. పోరాడుతూనే ఉన్నాం'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన విషయంలో టీడీపీ, బీజేపీలు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నాయని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ' ఎన్నికల్లో ఏపీ ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. అయినాసరే గతంలే ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా కోసం మేం పోరాడుతూనే ఉంటాం' అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం శనివారం తిరుపతిలో ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్త కోటి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.