'సుశీల్ కుమార్ షిండేవి ఓటు బ్యాంకు రాజకీయాలు'
ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడతున్నారని కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండేపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటి కమ్యూనిటి సభ్యులపై ఉన్న ఉగ్రవాద కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్ష జరపాలని షిండే చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. చట్టాన్ని అతిక్రమిస్తే కులమతాలకు సంబంధం లేకుండా అరెస్ట్ చేయాలని ఆయన అన్నారు. అయితే దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తిస్తున్న ముస్లీంలపై కేసులు పెట్టకూడదా అని మోడీ ఓ ర్యాలీలో ప్రశ్నించారు. దేశానికి సంబంధించినంత వరకు ఓటు బ్యాంకు రాజకీయాలు ఉండకూడదు అని ఆయన సూచించారు. గోవా రాజధాని పనాజీలో జరిగిన ఓ ర్యాలీలో మోడీ ప్రసంగించారు.