హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యే కాదు : షిండే
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన విషయంలో చిన్న చిన్న సమస్యలున్నాయని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. విభజన సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామన్న కేంద్ర హోంమంత్రి.. చివరి క్షణం వరకు మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు.
తెలంగాణ నివేదిక ఇంకా తయారవుతూనే ఉందని ఈరోజు జరగబోయే కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణపై చర్చ ఉండదని ఆయన వెల్లడించారు. తెలంగాణ బిల్లు తయారీకి ఇంకా సమయం పడుతుందనికూడా అన్న షిండే .. విభజనతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడొద్దనేదే తమ తాపత్రయమని ఢిల్లీ మీడియాకు వివరించారు. హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యే కాదన్న ఆయన .. నిజమైన సమస్యలేంటో తాను ఇప్పుడు చెప్పననడం విశేషం. రాష్ట్ర విభజనకు సంబంధించి పలు విషయాలపై ఢిల్లీ మీడియాతో షిండే చిట్చాట్ మాట్లాడారు.