cabine meeting
-
లౌడ్ స్పీకర్లు బ్యాన్.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు!
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయడంతోనే కీలక ప్రకటనలు చేశారు. లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేయడంతో పాటు, బహిరంగంగా మాంసం, గుడ్ల విక్రయాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు వీవీఐపీ అతిథుల సమక్షంలో మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామంటూ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు దుకాణాలను నడపడానికి భారత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, మధ్యప్రదేశ్‌లో వీటిని అనుసరించేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశామని సీఎం తెలిపారు. ప్రతి జిల్లాలో యువత కోసం ఒక ఎక్స్‌లెన్స్ కళాశాలను నిర్మిస్తామని, దీనిని ప్రధాన మంత్రి ఎక్స్‌లెన్స్ కళాశాలగా పిలుస్తామన్నారు. ఇందుకోసం 52 కాలేజీలు ఎంపిక చేశామని తెలిపారు. డిగ్రీ మార్క్స్‌షీట్‌ల కోసం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వీటికి పరిష్కారంగా కాలేజీలు, యూనివర్శిటీలలలో డిజీ లాకర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కాగా తరచూ నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు హోంశాఖతో మాట్లాడామన్నారు. ధ్వని పరికరాలను నియంత్రించనున్నామని, ఎవరైనా మతపరమైన ప్రదేశంలో పరిమితులను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. జనవరి 22న యూపీలోని అయోధ్యలో జరిగే నూతన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోనూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అయోధ్యకు వెళ్లే వారికి రామమందిర మార్గంలో స్వాగత సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2024 జనవరి ఒకటి నుంచి రాష్టంలోని మొత్తం 55 జిల్లాలలో సైబర్ తహసీల్ ఏర్పాటు చేయనున్నమని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. -
ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం
-
దళితులకు వరాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
-
బడ్జెట్ వాయిదా?: కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ
న్యూఢిల్లీ: మళప్పురం లోక్‌సభ సభ్యుడు ఇ. అహ్మద్ హఠాన్మరణం నేపథ్యంలో బుధవారమే బడ్జెట్ ప్రవేశపెట్టాలా? లేక గురువారానికి వాయిదా వేయాలా? అనేదానిపై కేంద్ర మంత్రివర్గం సమాలోచనలు జరుపుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే భేటీకి పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. అరుణ్ జైట్లీ సిద్ధం చేసిన బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. (ఎంపీ హఠాన్మరణం:కేంద్ర బడ్జెట్ వాయిదా..?) పార్లమెంట్ వాయిదాపై తుది నిర్ణయం స్పీకర్ సుమిత్రా మహాజన్దే అయినప్పటికీ, ప్రభుత్వ అభిప్రాయం ఏమిటన్నది కీలకాంశంగా మారింది. చనిపోయిన వ్యక్తి సిట్టింగ్ ఎంపీ కావడం, అందునా, పార్లమెంట్ సెంట్రల్ హాలులోనే కుప్పకూలడం లాంటి అంశాల నేపథ్యంలో బడ్జెట్‌ను ఒక రోజుకు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరే అవకాశంఉంది. అన్నివర్గాల అభిప్రాయాలు విన్నపిదప ఉదయం 10 గంటలకు స్పీకర్ నిర్ణయం వెల్లడిస్తారని తెలిసింది. ఇదిలా ఉంటే, ‘నేటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి, ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. బడ్జెట్ యధాతధంగా ప్రకటించే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యే కాదు : షిండే
-
హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యే కాదు : షిండే
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన విషయంలో చిన్న చిన్న సమస్యలున్నాయని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. విభజన సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామన్న కేంద్ర హోంమంత్రి.. చివరి క్షణం వరకు మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు. తెలంగాణ నివేదిక ఇంకా తయారవుతూనే ఉందని ఈరోజు జరగబోయే కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణపై చర్చ ఉండదని ఆయన వెల్లడించారు. తెలంగాణ బిల్లు తయారీకి ఇంకా సమయం పడుతుందనికూడా అన్న షిండే .. విభజనతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడొద్దనేదే తమ తాపత్రయమని ఢిల్లీ మీడియాకు వివరించారు. హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యే కాదన్న ఆయన .. నిజమైన సమస్యలేంటో తాను ఇప్పుడు చెప్పననడం విశేషం. రాష్ట్ర విభజనకు సంబంధించి పలు విషయాలపై ఢిల్లీ మీడియాతో షిండే చిట్‌చాట్ మాట్లాడారు.