'దిగ్విజయ్,షిండేలు నిజాలు వక్రీకరిస్తున్నారు' | Digvijay Singh, sushil kumar shinde are talking beyond the facts, says ysr congress party leaders | Sakshi
Sakshi News home page

'దిగ్విజయ్,షిండేలు నిజాలు వక్రీకరిస్తున్నారు'

Published Thu, Oct 10 2013 1:39 PM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

Digvijay Singh, sushil kumar shinde are talking beyond the facts, says ysr congress party leaders

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో కాంగ్రెస్ పార్టీలోని జాతీయ స్థాయి నేతలైన దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండేలు నిజాలు వక్రీకరించి మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు గురువారం న్యూఢిల్లీలో ఆరోపించారు.

 

తెలంగాణాకు అనుకూలమని తమ పార్టీ ఎప్పుడూ చెప్పలేదని వారు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని మాత్రం ప్రస్తావించామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఎస్పార్సీ గురించి మాత్రమే చెప్పారని వారు గుర్తు చేశారు. కోర్ కమిటీలో ఉన్న నేతలంతా కేంద్ర మంత్రివర్గ బృందంలో ఉన్నారని చెప్పారు.

 

తమకు మంత్రుల కమిటీపై నమ్మకం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు   నాయుడుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోబియాలో ఉన్నారని ఎద్దెవా చేశారు. సమైక్యమా లేక తెలంగాణాకు అనుకూలమా అనేది ముందుగా చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement