28న వైఎస్సార్‌సీపీ సమావేశం | 28th ysrcp party meeting | Sakshi
Sakshi News home page

28న వైఎస్సార్‌సీపీ సమావేశం

Published Sat, Oct 25 2014 5:13 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

28న వైఎస్సార్‌సీపీ సమావేశం - Sakshi

28న వైఎస్సార్‌సీపీ సమావేశం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజా సమస్యలు.. ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఆమేరకు జిల్లా పార్టీ నాయకులతో చర్చించి కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 28న సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు.
 
 పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు, విజయసాయిరెడ్డి హాజరుకానున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఈ సమావేశానికి పార్లమెంట్, అసెంబ్లీ అబ్జర్వర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నేతలు హాజరు కావాలని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు జరుగనున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement