uma reddy venkateswarlu
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్‌మేళా వెబ్సైట్ ప్రారంభం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్ మేళా వెబ్‌సైట్‌ను ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు హాజరయ్యారు. తొలి విడతలో 15 వేల ఉద్యోగాలు: ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. తొలి విడతలో కనీసంగా 15 వేల ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఈనెల 16, 17న తిరుపతి.. 23, 24 తేదీలలో విశాఖపట్నం.. 30 మే 1 న గుంటూరులో జాబ్ మేళా నిర్వహిస్తామని వెల్లడించారు. టెన్త్ నుంచి పీహెచ్డీ వరకు చదివిన వారు అప్లై చేసుకోవచ్చన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు: కన్నబాబు లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పార్టీకోసం పనిచేసిన వారికి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. 1.22 లక్షల మందికి సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 2.59 లక్షల మంది వాలంటీర్లను నియమించామని మంత్రి పేర్కొన్నారు. -
అంబుడ్స్‌మెన్ వ్యవస్థను అటకెక్కించారు
సాక్షి, హైదరాబాద్ : పంచాయితీ రాజ్ వ్యవస్థలో అవినీతి లేకుండా ఉండేందుకు అంబుడ్స్‌మెన్ వ్యవస్థ ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పంచాయితీ రాజ్, రాజ్యాంగ సవరణపై మంత్రి లోకేశ్‌కు అవగాహన కల్పించాలని అన్నారు. కేరళలో పంచాయితీ రాజ్ వ్యవస్థను ఓ సారి చూసి రావాలని సూచించారు. వైఎస్సార్ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు పంచాయితీ రాజ్ దినోత్సవం.. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ సర్పంచ్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి లేదని విమర్శించారు. రాజ్యాంగంలో ఇచ్చిన అధికారాలు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో అంబుడ్స్‌మెన్ వ్యవస్థ అమలు కావడం లేదు.. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేవలం పది అధికారాలను మాత్రమే పంచాయితీలకు ఇచ్చింది’ అని వ్యాఖ్యానించారు. వాటిని మైనింగ్, ఇసుక మాఫియాలా తయారు చేసిందని ఆరోపించారు. పంచాయితీలు కునారిల్లుతున్నా.. ప్రభుత్వ అక్రమాలు బయటపడతాయనే అంబుడ్స్‌మెన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని ఉమ్మారెడ్డి విమర్శించారు. పండించిన పంటను కొనే నాధుడు లేడు.. అయినా ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పించన్, ఇల్లు కావాలంటే జన్మభూమి కమిటీ దగ్గరకు వెళ్లమంటున్నారు.. టీడీపీ వాళ్లు కాదంటే చెక్ పవర్ తీసేస్తారని ఎద్దేవా చేశారు. పంచాయితీ రాజ్ వ్యవస్థలో ఇన్ని దురాగతాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదని అన్నారు. 73వ రాజ్యాంగ సవరణను అమలు చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. కానీ ఇప్పడు వాటిని అమలు చేయకుండా ఆత్మ వంచనకు పాల్పడుతుందని తెలిపారు. గ్రామ పంచాయితీలను బలోపేతం చేసేందుకు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రత్యేక హోదాపై చంద్రబాబుకి చిత్తశుధ్ది లేదు
-
బాధ్యతలు స్వీకరించిన ఉమ్మారెడ్డి
-
శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి
-
శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి
సాక్షి, అమరావతి: శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ చక్రపాణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లభించినట్లయింది. 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 67 సీట్లు సాధించడంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా లభించింది. శాసనమండలిలో మొన్నటివరకూ కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య ఆ పార్టీ సభ్యుల రీత్యా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆయన పదవీకాలం గత నెల 29తో ముగిసింది. మరో వైపు వైఎస్సార్సీపీ సభ్యుల బలం ఎనిమిది(కాంగ్రెస్ కన్నా అధికం)కి చేరుకుంది. దీంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ప్రతిపక్ష నేత హోదాను కల్పిస్తూ చైర్మన్ చక్రపాణి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. మండలిలోనూ పార్టీ సభ్యులందర్నీ ఏకతాటిపై నడిపి ప్రజాప్రయోజనాల కోసం కృషి చేస్తానని ఉమ్మారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. -
రాజధాని పేరుతో నిరంకుశంగా భూసేకరణ
-
'86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు'
ఏలూరు : చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో 86 మంది రైతులు చనిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రెండు రోజుల రైతు దీక్ష కార్యక్రమం శనివారం తణుకు పట్టణంలో ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాలని సభకు వచ్చిన రైతులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాంతో సభ వేదికపై ఉన్న నాయకులు, రైతులు, ప్రజలు అంతా రెండు నిముషాలు మౌనం పాటించారు. -
28న వైఎస్సార్సీపీ సమావేశం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజా సమస్యలు.. ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఆమేరకు జిల్లా పార్టీ నాయకులతో చర్చించి కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 28న సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు, విజయసాయిరెడ్డి హాజరుకానున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఈ సమావేశానికి పార్లమెంట్, అసెంబ్లీ అబ్జర్వర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నేతలు హాజరు కావాలని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు జరుగనున్నట్లు తెలిపారు. -
వంట గ్యాస్ ధర పెంపు ఉపసంహరించాలి
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీలేని వంట గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం పెంచిన రూ.215ను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సామ్యానుడికి పెనుభారం మోపే చర్యలను పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. సబ్సిడీ లేని వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.1112 నుంచి 1327కు పెంచడం దారుణమన్నారు. ఒకవైపు నిత్యావసర ధరలు, కూరగాయలు మండుతుంటే మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం, మరోపక్క గ్యాస్ ధరలు పెంచి సామ్యానుడి నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్ ధరల విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే ప్రజలపై భారం పడకుండా చూడగలిగారన్నారు. ‘చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టే నాటికి 1995లో గ్యాస్ సిలిండర్ ధర రూ.147గా ఉంది. అది ఆయన హయాంలోనే వంద శాతం పెరిగి రూ.305కు చేరింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్రం గ్యాస్ ధరలను పెంచినా ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే భరించేలా వైఎస్ చర్యలు తీసుకున్నారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన రోశయ్య హయాంలో కేంద్రం పెంచిన రూ.50ని ప్రజలపైనే రుద్దారు. సీఎం కిరణ్ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.450కి చేరింది’ అని తెలిపారు. అవినీతి గురించి బాబా మాట్లాడేది? బహిరంగ చర్చలంటూ చంద్రబాబు చేసిన సవాల్‌ను ప్రస్తావించగా... ‘ముందు ఆయనపై ఉన్న ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలి. చంద్రబాబు తనపై విచారణలు జరపొద్దంటూ, కమిషన్లను ఉపసంహరింపచేయాలంటూ కోర్టులకెళ్లి ‘స్టే’లు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. బాబు హయాంలో వేలాది ఎకరాలను ఆయన అనుయాయులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచిపెట్టారు. అవినీతి గురించి చంద్రబాబు ఎంత తక్కువ మాట్లాడితే ప్రజలు అంత సంతోషిస్తారు’ అని వ్యాఖ్యానించారు. -
'దిగ్విజయ్,షిండేలు నిజాలు వక్రీకరిస్తున్నారు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో కాంగ్రెస్ పార్టీలోని జాతీయ స్థాయి నేతలైన దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండేలు నిజాలు వక్రీకరించి మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు గురువారం న్యూఢిల్లీలో ఆరోపించారు. తెలంగాణాకు అనుకూలమని తమ పార్టీ ఎప్పుడూ చెప్పలేదని వారు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని మాత్రం ప్రస్తావించామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఎస్పార్సీ గురించి మాత్రమే చెప్పారని వారు గుర్తు చేశారు. కోర్ కమిటీలో ఉన్న నేతలంతా కేంద్ర మంత్రివర్గ బృందంలో ఉన్నారని చెప్పారు. తమకు మంత్రుల కమిటీపై నమ్మకం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోబియాలో ఉన్నారని ఎద్దెవా చేశారు. సమైక్యమా లేక తెలంగాణాకు అనుకూలమా అనేది ముందుగా చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.