షిండేపై పిటిషన్ను విచారించనున్న ముంబై హైకోర్టు | Bombay High Court to hear plea against Sushil Kumar Shinde in Adarsh scam | Sakshi
Sakshi News home page

షిండేపై పిటిషన్ను విచారించనున్న ముంబై హైకోర్టు

Published Thu, Oct 17 2013 5:16 PM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM

షిండేపై పిటిషన్ను విచారించనున్న ముంబై హైకోర్టు - Sakshi

షిండేపై పిటిషన్ను విచారించనున్న ముంబై హైకోర్టు

మహారాష్ట్రను కుదిపేసిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం.. కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను వెంటాడుతోంది. షిండేను నిందితుడిగా చేర్చాలంటూ ఓ సామాజిక ఉద్యమకర్త దాఖలు చేసిన పిటిషన్ను ముంబై హైకోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ కేసులో షిండే ప్రమేయముందంటూ ప్రవీణ్ వాటెగాన్కర్ అనే వ్యక్తి న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

ఆదర్శ్ బిల్డింగ్లో షిండే బినామీ పేర్లతో ప్లాట్లను పొందారని ఆరోపించారు. దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని ఫిర్యాదు దారు కోరారు. కాగా బినామీ దారులపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో షిండే పాత్ర లేదని తేలినట్టు కోర్టుకు తెలిపారు. కాగా కేసు విచారణ పూర్తయిన అనంతరం పిటిషన్ను విచారించనున్నట్టు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. విచారణకు వచ్చే నెల 26కు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement