ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటు చేసిన జీఎంవో(కేంద్ర మంత్రుల బృందం) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతలను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయంలో శుక్రవారం తొలిసారి సమావేశం అయ్యింది. ఈ భేటీ అనంతరం జీఎంవో సభ్యులకు కొన్ని కీలక బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, అనారోగ్య కారణాలతో ఆంటోనీ, విదేశీ పర్యటనలో ఉన్న చిదంబరం ఈ భేటీకి అందుబాటులో లేరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి ఏర్పాటు చేసిన జీఎంవో సభ్యుల బాధ్యతల వివరాలు..
ఆంటోనీ - సరిహద్దులు, రక్షణ సంస్థల వ్యవహారాలు
షిండే - హైదరాబాద్, ఉమ్మడి రాజధాని యంత్రాంగం ఏర్పాటు
మొయిలీ - న్యాయవ్యవహారాలు
ఆజాద్ - విద్య, వైద్య, ఉపాధి
నారాయణస్వామి - ఐఎఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల వ్యవహారాలు
జైరాం రమేష్ - వెనుకబడిన ప్రాంతాల గుర్తింపు, స్పెషల్ ప్యాకేజీ , జలవనరుల పంపిణీ
చిదంబరం - ఆర్థిక వ్యవహారాలు
జీఎంవో సభ్యులకు బాధ్యతల కేటాయింపు
Published Fri, Oct 11 2013 4:49 PM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement
Advertisement