ఒక్కో పార్టీ నుంచి ఒక్కరే వస్తే మంచిది: షిండే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఏర్పాటుచేసిన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) మూడో సమావేశం ముగిసింది. ఈ సాయంత్రం గంటన్నరపాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే జీవోఎంకు 29 పేజీల నివేదిక సమర్పించారు. జీవోఎంకు 18వేల సలహాలు, సూచనలు వచ్చాయని భేటీ ముగిసిన తర్వాత షిండే విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఈనెల 11న కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో జీవోఎం సమావేశం ఉంటుందన్నారు. 12,13 తేదీల్లో 8 రాజకీయ పార్టీలతో సమావేశం అవుతామని తెలిపారు. ఒక్కో పార్టీ నుంచి ఒక్కరు లేదా ఇద్దరు రావొచ్చన్నారు. సమావేశానికి ఒక్కరే వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఒక్కో పార్టీకి 20 నిమిషాల సమయం కేటాయించామన్నారు.18న ఆంధ్రప్రదేశ్కు చెందిన కేంద్రమంత్రులతో సమావేశమవుతామని షిండే వెల్లడించారు.