శీతాకాల సమావేశాలకు ముందే జీవోఎం నివేదిక: షిండే
తెలంగాణపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈరోజపు సాయంత్రం 4.30 గంటలకు హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో అధికారులు భేటీ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హోం శాఖ అధికారులతో చర్చించారు. కాగా, శీతాకాల సమావేశాలకు ముందే మంత్రుల బృందం తన నివేదికను అందజేస్తుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా చెప్పారు.
దాదాపు సగానికి పైగా రాష్ట్ర ప్రజలు విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా.. కేవలం తన మొండి పట్టుదల కోసమే కాంగ్రెస్ పార్టీ విభజన విషయంలో ముందుకెళ్తోందని సీమాంధ్ర ప్రాంత వాసులు అంటున్నారు.