'ఐపీఎల్-7 కు భద్రత ఇవ్వలేం'
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్-7 క్రికెట్ మ్యాచ్లకు భద్రత కల్పించలేమని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఏప్రిల్-మే నెలల్లో దేశంలో సాధారణ ఎన్నికలు జరుగనున్నందున్న ఐపీఎల్ మ్యాచ్లకు భద్రత కల్పించటం కష్టమని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. ఐపీఎల్-7ను మరోదేశంలో నిర్వహించుకుంటే మంచిదని షిండే అభిప్రాయపడ్డారు.
దాంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్-7 ట్వెంటీ20 క్రికెట్ టోర్నిని ఈసారి భారత్ లో నిర్వహించడానికి అనుకూలంగా లేనందున దక్షిణాఫ్రికాలో నిర్వహించాలని ఐపీఎల్ యోచిస్తోంది. దక్షిణాఫ్రికాతో పాటు శ్రీలంకను కూడా పరిశీలిస్తోంది. కాగా సాధారణ ఎన్నికలు, భద్రతా కారణాల దృష్ట్యా 2009 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ టోర్నిని నిర్వహించిన సంగతి తెలిసిందే.