Impact Of Indian Premier League (IPL) On Indian And World Cricket - Sakshi
Sakshi News home page

అలా మొదలై.. కాసుల పంట పండిస్తోంది

Published Fri, Aug 11 2023 5:32 PM | Last Updated on Fri, Aug 11 2023 6:43 PM

IPL Impact On Indian And World Cricket - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. భారత క్రికెట్‌లో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. అభిమానులకు టీ20 క్రికెట్‌ రుచిని చూపించేందుకు పుట్టుకువచ్చిన ఐపీఎల్‌.. ఇప్పుడు కాసుల వర్షం కురిపించే క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా మారిపోయింది. ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు క్రికెట్‌ ప్రపంచానికి పరిచమయ్యారు.

కోహ్లి నుంచి తిలక్‌ వర్మ వర​కు ఈ మెగా ఈవెంట్‌లో సత్తా చాటి భారత జట్టులోకి వచ్చిన వారే. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను కోట్లకు అధిపతి చేసిన ఘనత కూడా ఈ ఐపీఎల్‌దే. ప్రపంచంలోని ప్రతీ ఒక్క ఆటగాడు కనీసం ఒక్కసారైనా ఐపీఎల్‌లో భాగం కావాలని భాగం కావాలని కలలు కంటాడు.

ఈ ఏడాదితో మొత్తం 16 సీజన్లను ఐపీఎల్‌ దిగ్వజయంగా పూర్తిచేసుకుంది. ఐపీఎల్‌తో భారత క్రికెట్‌లో ఒక కొత్త శకం మొదలైందనే చెప్పాలి. ఎంతోమంది టాలెంటెడ్‌ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఐపీఎల్‌.. అంతే స్థాయి లాభాలతో మురిసిపోయింది. ఒక సాధరణ ఫ్రాంఛైజీ క్రికెట్‌ లీగ్‌గా మొదలైన ఐపీఎల్‌.. ప్రపంచక్రికెట్‌ను శాసించే స్ధాయికి ఎలా చేరుకుందో ఓ లూక్కేద్దాం.

అలా మొదలైంది..
15 ఏళ్ల క్రితం వరకు భారత డొమాస్టిక్‌ క్రికెట్‌లో కనీస మౌళి​క​ సదుపాయాలు ఉండేవి కావు. ఈ క్రమంలో జాతీయ జట్టు నుంచి ఆటగాళ్లు రిటైర్‌ అయ్యాక.. వారిని భర్తీ చేసేందుకు సరైన ఆటగాళ్లు అందుబాటులో లేకపోయేవారు. ఈ సమయంలో ఈస్సెల్‌ గ్రూపు సీఈవో సుభాష్‌ చంద్ర భారత క్రికెట్‌ను అభివృద్ది చేసేందుకు ముందుకు వచ్చాడు. భారత్‌లో జరిగే మ్యాచ్‌ల ప్రసారాల కోసం జీ స్పోర్ట్స్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. 

అదే విధంగా టెన్‌స్పోర్ట్స్‌ ఛానల్‌లోని 50 శాతం వాటాను కూడా సుభాష్‌ చంద్ర కొనుగోలు చేశాడు. దీంతో పాకిస్తాన్‌, శ్రీలంక, వెస్టిండీస్‌లో జరిగే మ్యాచ్‌లను ప్రసారం చేసే కాంట్రాక్ట్‌ టెన్‌స్పోర్ట్స్ దక్కించుకుంది. అయితే భారత్‌లో జరిగే మ్యాచ్‌లు టెలికాస్టింగ్‌ రైట్స్‌ మాత్రం  జీ స్పోర్ట్స్ దక్కలేదు. 

జీ ఛానల్‌కు స్పోర్ట్‌ మార్కటింగ్‌ అనుభవం లేదని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ప్రసార హక్కులను తిరష్కరించాడు. సుభాష్‌ చంద్ర తన రాజకీయ పలుకుబడి ఉపయోగించిన ఫలితం దక్కలేదు. ఇదే సమయంలో టీ20 క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రజాధారణ పెరుగుతోంది. దీంతో 2007లో దక్షిణాఫ్రికా వేదికగా తొలి టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ నిర్వహించింది. ఈ టోర్నీలో అండర్‌​ డగ్స్‌గా బరిలోకి దిగిన భారత్‌.. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచింది.

టీమిండియా తొలి టీ20 ప్రపంచకప్‌ సాధించినప్పటికీ.. భారత్‌లో మాత్రం టీ20 క్రికెట్‌కు అదరణ పెద్దగా లేదు. ఈ క్రమంలో బీసీసీఐకు రెబల్‌గా ఉన్న సుభాష్‌ చంద్ర దేశీవాళీ క్రికెట్‌లో ఓ టీ20 టోర్నీని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లోని స్టార్‌ ఆటగాళ్లు, ప్రపంచంలోని కొంతమంది క్రికెటర్లతో సుభాష్‌ చంద్ర ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్‌కు అతడు ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ అని నామకారణం చేశాడు. ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ మొదటి సీజన్‌ 2007లో ప్రారంభమైంది. అయితే ఈ లీగ్‌పై బీసీసీఐ మొదటి నుంచే అంసతృప్తిగా ఉంది.

ఈ లీగ్‌ను అపేందుకు  బీసీసీఐ చాలా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా డొమాస్టిక్‌ క్రికెట్‌లో ఆటగాళ్ల జీతాలను భారీగా పేంచేసింది. ఆటగాళ్లు ఎవరూ ఈ లీగ్‌లో ఆడకూడదని బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఐసీఎల్‌కు ఎండ్‌కార్డ్‌ వేయాలని బీసీసీఐ వ్యూహాలు మొదలుపెట్టింది. క్రమంలో బీసీసీఐ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్న లలిత్ మోడీకి ఆలోచన వచ్చింది. బీసీసీఐ అద్వర్యంలోనే ఓ క్రికెట్‌ లీగ్‌ మొదలుపెడితే బాగుటుందని మోడీ నిర్ణయించుకున్నాడు.

లలిత్ మోడీ ఆలోచనల నుంచి పుట్టుకువచ్చిందే ఈ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. 13 సెప్టెంబర్‌ 2007న ఐపీఎల్‌ను బీసీసీ అధికారంగా లాంఛ్‌ చేసింది. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA) ఫార్మాట్‌ ఆధారంగా ఐపీఎల్‌ ఫార్మాట్‌ను మోడీ తీర్చిదిద్దాడు. మొదటి ఐపీఎల్ వేలం  జనవరి 24, 2008న జరిగింది. 

2008లో ప్రారంభమైన తొలి సీజన్‌లో మొత్తం 8 జట్లు పాల్గొనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్,డెక్కన్ ఛార్జర్స్,ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ​కోల్‌కతా నైటరైడర్స్‌ జట్లు, ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌  బెంగళూరు జట్లు మొదటి సీజనన్‌లో భాగమయ్యాయి. ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌  విజేతగా దివంగత షేన్‌ వార్న్‌ సారధ్యంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ నిలిచింది.

ప్రస్తుతం ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూపంలో మరో రెండు జట్లు ఈ లీగ్‌లో భాగమయ్యాయి. ఇప్పటివరకు 16 సీజన్లలో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ చెరో ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలవగా.. కోల్‌కతా,  డెక్కన్ ఛార్జర్స్ రెండు సార్లు, రాజస్తాన్‌, గుజరాత్‌ ఒక్కసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి.

యువ క్రికెటర్లు ఎంట్రీ..
యువ క్రికెటర్లు తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఐపీఎల్‌ ఒక సరైన వేదిక. ఎంతో మంది ఆటగాళ్లు ఇదే వేదికపై సత్తాచాటి జాతీయ జట్టులో చోటు దక్కించకున్నారు. ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌ నుంచి సరికొత్త యంగ్‌ టాలెంట్‌ ప్రపంచానికి పరిచయవుతోంది. ముఖ్యంగా సీనియర్‌ క్రికెటర్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకోవడంతో యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చకుంటున్నారు. భారత్‌ మాత్రమే కాకుండా విదేశీ యువ క్రికెటర్లు కూడా ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్నారు.

బీసీసీఐపై కాసుల వర్షం...
ఈ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెటర్లపైనే కాకుండా భారత క్రికెట్‌ బోర్డుపై కాసుల వర్షం కురిపిస్తోంది. బీసీసీఐను ప్రపంచక్రికెట్‌లో ధనిక బోర్డుగా ఐపీఎల్‌ మార్చేసేంది. బీసీసీఐకు ఐపీఎల్‌ బంగారు బాతు.  ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ భారీగా అర్జిస్తోంది. తాజాగా ఐపీఎల్ ఐదేళ్ల(2023-27) మీడియా రైట్స్‌ను  రూ. 48,390 కోట్లకు బీసీసీఐ  విక్రయించింది. అంతేకాకుండా ఫ్రాంజైలు, కార్పొరేట్ స్పాన్సర్స్‌ల నుంచి  వేల కోట్లు బీసీసీఐ ఖాజానాలో వచ్చి చేరుతున్నాయి. 

అభిమానులకు పండగే..
ప్రతీ ఏడాది క్రికెట్‌ అభిమానులను రెండు నెలల పాటు ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ అలరిస్తోంది. మార్చిలో మొదలై మేలో ఈ వరల్డ్‌ ఫేమస్‌ లీగ్‌ ముగుస్తుంది. మ్యాచ్‌లో సమయంలో అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ప్రతీ జట్టుకు స్పెషల్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది.

ఐపీఎల్‌ వల్ల నష్టాలు..
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌ విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చాయి. ఈ ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్‌లలో మోజులో పడి ఆటగాళ్లు త​మ దేశం తరపున ఆడేందుకు విముఖత చూపుతున్నారు. కొంతమంది అయితే ఈ లీగ్‌ల్లో భాగం కావడానికి ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌కే విడ్కోలు పలుకుతున్నారు.

ఒకప్పుడు తమ దేశం తరపున ఆడితే చాలని భావించిన క్రికెటర్లు.. ఇప్పుడు ఐపీఎల్‌ వంటి ఫ్రాంచైజీ లీగ్‌ల్లొ ఆడితే చాలని అనుకుంటున్నారు. అంతే కాకుండా ఐపీఎల్‌లో విరామం లేకుండా రెండు నెలలపాటు ఆడటంతో ఆటగాళ్లు అలసటకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ లీగ్‌లో గాయపడి దేశం తరపున ఆడే కీలక టోర్నీలకు దూరం అవుతున్నారు. అదే విధంగా ఈ ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్‌లు వల్ల టెస్టుక్రికెట్‌ కూడా ఆడేందుకు ఆటగాళ్లు ముందుకు రావడం లేదు. చాలా కెరీర్‌ ఉన్నప్పటికీ ముందుగానే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నారు.

బెట్టింగ్‌లు జోరుగా
ఇక ఐపీఎల్‌లో మొదలైతే చాలు బెట్టింగ్‌ రాయులకు పండగే. ఈ క్రికెట్‌ పండగ జరిగే రెండు నెలలపాటు దేశవ్యాప్తంగా బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. చాలా మంది బెట్టింగ్‌ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఐపీఎల్‌లో చీకటి కోణాలు..
ఇక విజయవంతంగా దూసుకుపోతున్న ఐపీఎల్‌లో వినోదం మాత్రమే కాదు ఎన్నో చీకటి కోణాలు కూడా ఉన్నాయి. సరిగ్గా పదేళ్ల క్రితం 2013 సీజన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ తీవ్ర కలకలం రేపింది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు శ్రీశాంత్‌, అజయ్‌ చండీలా, అంకిత్‌ చౌహాన్‌ బుకీల నుంచి డబ్బు తీసుకుని ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు.

దీంతో బీసీసీఐ వారిపై జీవితకాల నిషేధం విధించింది. అలాగే రాజస్థాన్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించారు.  ఐపీఎల్ లో ఓ సారి రాహుల్ శర్మ, దక్షిణాఫ్రికా ప్లేయర్ వైన్‌ పార్నెల్ ఓ రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డారు. ఆ పార్టీలో డ్రగ్స్ కూడా దొరికాయి. ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. అదే విధంగా ఛీర్ గర్ల్స్ ఊదంతం కూడా  ఐపీఎల్ ను ఓ ఊపు ఊపేసింది.  కొంతమంది ఆటగాళ్లు తామతో అసభ్య ప్రవర్తన చేశారని  ఛీర్ గర్ల్స్ గతంలో  ఆరోపణలు చేశారు.
చదవండిPV Sindhu Headlines This List: అప్పుడు వాళ్లు అలా! ఇప్పుడు వీరిలా.. తలెత్తుకునేలా చేశారు.. శెభాష్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement