ఉప్పల్ స్టేడియం(ఫైల్‌ఫొటో)
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐపీఎల్ 11వ సీజన్ పోటీలు ఏప్రిల్ 9 నుంచి జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును లీగ్ పాలకమండలి బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్ 7న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)ల మధ్య పోరుతో ఈ సీజన్ మొదలవుతుంది. వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సీఎస్‌కేలాగే పునరాగమనం చేసిన రాజస్తాన్ రాయల్స్ తమ తొలి పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది. ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఏప్రిల్ 9న ఈ మ్యాచ్ జరుగుతుంది. ముంబైలోని వాంఖెడేలో ఆరంభ మ్యాచ్‌తో పాటు తొలి క్వాలిఫయర్ (మే 22), టైటిల్ పోరు (27న) కూడా జరుగనుంది. అయితే మ్యాచ్‌ల టైమింగ్‌లో ఏమార్పూ లేదు. ఒక మ్యాచ్ ఉంటే రాత్రి 8 గంటలకు, రెండు మ్యాచ్‌లుంటే మొదటి మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు మొదలవుతాయి. ఈ మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఇంతకుముందు సాయంత్రం మ్యాచ్‌ను 5 గంటల నుంచి, రాత్రి మ్యాచ్‌ను 7 గంటల నుంచి నిర్వహించాలనే ప్రతిపాదనలువచ్చాయి. కానీ విజయవంతమైన పది సీజన్లలాగే మ్యాచ్ టైమింగ్‌ను ఖరారు చేశారు.
హైదరాబాద్‌లో ఐపీఎల్ షెడ్యూలు
ఏప్రిల్ 9 రాజస్తాన్ రాయల్స్ రా.గం. 8
ఏప్రిల్ 12 ముంబై ఇండియన్స్ రా.గం. 8
ఏప్రిల్ 22 చెన్నై సూపర్‌కింగ్స్ సా.గం. 4
ఏప్రిల్ 26 కింగ్స్‌పంజాబ్ రా.గం. 8
మే 5 ఢిల్లీ డేర్‌డెవిల్స్ రా.గం. 8
మే 7 బెంగళూరు రా.గం.8
మే 19 కోల్‌కతా నైట్‌రైడర్స్ రా.గం.8
Comments
Please login to add a commentAdd a comment