దక్షిణాఫ్రికాలో ఐపీఎల్-7 టోర్ని?
దక్షిణాఫ్రికాలో ఐపీఎల్-7 టోర్ని?
Published Thu, Feb 13 2014 4:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
ఇండియన్ ప్రీమియర్ లీగ్-7 ట్వెంటీ20 క్రికెట్ టోర్నిని ఈసారి భారత్ లో నిర్వహించడానికి అనుకూలంగా లేనందున దక్షిణాఫ్రికాలో నిర్వహించాలని అనుకుంటున్నట్టు ఐపీఎల్ చైర్మన్ రంజిబ్ బిస్వాల్ తెలిపారు. ఏప్రిల్-మే నెలల్లో దేశంలో సాధారణ ఎన్నికలు జరుగనున్నందున్న ఐపీఎల్-7ను దక్షిణాఫ్రికాకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు బిస్వాల్ వెల్లడించారు.
తుది నిర్ణయం, వేదికలను, ఐపీఎల్ షెడ్యూల్ ను పది రోజుల్లోపల వెల్లడిస్తామని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ నిర్వహణ కోసం హోంశాఖ అధికారులను కలువనున్నామని బిస్వాల్ తెలిపారు. భారత్ లో కూడా ఐపీఎల్ నిర్వహించే అంశాలను, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు.
ఏప్రిల్, మే నెలల్లో భారత్ లో ఐపీఎల్ నిర్వహణకు అనుకూలంగా లేకపోతే దక్షిణాఫ్రికాలో నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటాం అని అన్నారు. యూఏఈ, బంగ్లాదేశ్ లో ఐపీఎల్ నిర్వహించే ఆలోచనే రాలేదని ఓ ప్రశ్న తలెత్తలేదని ఆయన అన్నారు. సాధారణ ఎన్నికలు, భద్రతా కారణాల దృష్ట్యా 2009 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ టోర్నిని నిర్వహించిన సంగతి తెలిసిందే.
Advertisement