
‘యూపీఏ జమానాలో 3 సర్జికల్ దాడులు’
ముంబై: యూపీఏ పాలనా కాలంలో 2009–13 మధ్య మూడు సర్జికల్ దాడులు జరిగాయని కానీ ప్రభుత్వం వాటిని బయటికి రానీయలేదని మాజీ హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆర్మీ చర్యలతో ప్రయోజనం పొందాలని చూస్తోందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ ప్రభుత్వం ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు చేస్తోందన్నారు.
మహారాష్ట్రలో త్వరలో జరగబోయే 25 జిల్లా పరిషత్ ఎన్నికలకు ఆయన శనివారం ఉస్మానాబాద్ జిల్లాలో పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు వల్ల రైతులు ఇబ్బంది పడ్డారన్నారు.