
కేరళ గవర్నర్‌గా షీలా దీక్షిత్
కేరళ గవర్నర్‌గా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(75) నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ వర్గాలు మంగళవారం రాత్రి వెల్లడించా యి.
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్‌గా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(75) నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ వర్గాలు మంగళవారం రాత్రి వెల్లడించా యి. గవర్నర్‌గా ఆమె నియామకానికి సంబంధించిన విషయాన్ని మంగళవారం ఉదయం ఇక్కడ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసిన సందర్భంలోనే షీలాకు వివరించారని తెలిపాయి.
ఇదిలావుంటే, దీక్షిత్ మూడుసార్లు ఢిల్లీ సీఎంగా 1998 నుంచి 2013 వరకు ఉన్నారు.అదేవిధంగా 1984-89 మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా, ప్రస్తుత కేరళ గవర్నర్ నిఖిల్ కుమార్ ఆ పదవికి రాజీనామా చేసి, త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని ఔరంగాబాద్ నుంచి తలపడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గత డిసెంబర్‌లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై ఘోరపరాజయం పాలైన మూడు నెలల వ్యవధిలోనే దీక్షిత్ గవర్నర్‌గా నియమితులు కావడం గమనార్హం.