'కిరణ్కు మరో ప్రత్యామ్నాయం లేదు' | Kiran Reddy had no option but to resign: shushil kumar Shinde | Sakshi
Sakshi News home page

'కిరణ్కు మరో ప్రత్యామ్నాయం లేదు'

Published Wed, Feb 19 2014 2:14 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'కిరణ్కు మరో ప్రత్యామ్నాయం లేదు' - Sakshi

'కిరణ్కు మరో ప్రత్యామ్నాయం లేదు'

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తేలిగ్గా తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామాను కేంద్ర హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తేలిగ్గా తీసుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌కు రాజీనామా మినహా మరో ప్రత్యామ్నాయం ఏం ఉందని ప్రశ్నించారు.  

కిరణ్ రాజీనామా దురదృష్టకరం
సీఎం కిరణ్‌ రాజీనామా దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి పల్లంరాజు. రోశయ్య తర్వాత క్లిష్టపరిస్థితుల్లో రాష్ట్రానికి సీఎంగా వచ్చారని పలు పథకాలు చేపట్టారన్నారు. ఏది ఏమైనా సీఎం రాజీనామా చేయడం విచారించాల్సిన విషయం అన్నారు.

కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ : కాగా కిరణ్ రాజీనామా కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌లో భాగమని కమలనాధులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనల్లో భాగంగానే సీఎం తన పదవికి రాజీనామా చేశాడని పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సెన్ అన్నారు.  ఎన్నికలకు ముందు పార్టీ ఏర్పాటుచేయడం తర్వాత విలీనం చేయడమే కాంగ్రెస్  ప్రణాళిక అని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కూడా ఇలాగే ప్రవర్తించారని షానవాజ్ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement