kiran resign
-
కిరణ్ రాజీనామా ఆమోదించిన గవర్నర్
-
కిరణ్ రాజీనామా ఆమోదించిన గవర్నర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక జరిగేవరకూ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. అలాగే కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపారు. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందటంతో బుధవారం కిరణ్ కుమార్ రెడ్డి తన సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందచేశారు. -
సీఎంకు ‘పనికి రాని’ ఫైళ్లు వెనక్కి!
పనికి వచ్చే ఫైళ్లపై మంగళవారం వరకు కిరణ్ సంతకాలు సాక్షి, హైదరాబాద్: రాజీనామా చేయడానికి ముందే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు పనికి వచ్చే ఫైళ్లపై సంతకాలు కానిచ్చేశారు. మంగళవారం రాత్రి వరకు ఆయన ఇదే పనిలో ఉన్నారు. తనకు పనికి రావనుకున్న వందలాది ఫైళ్లను మాత్రం ఆయన ముట్టుకోలేదు. సాధారణంగా ఆమోదం పొందాల్సిన ఫైళ్లపై కూడా సీఎం కరుణ పడలేదు. దీంతో మిగిలిపోయిన వందలాది ఫైళ్లను సీఎం కార్యాలయ అధికారులు ఆయా శాఖల కు బుధవారం మధ్యాహ్నం నుంచే పంపించేయడం ప్రారంభించారు. సాధారణ పరిపాలన, పోలీసు, రెవెన్యూ, ఇంధన, ఆర్థిక శాఖకు చెందిన వందల సంఖ్యలో ఫైళ్లను అజయ్ కల్లం ఆయా శాఖలకు తిరిగి పంపిచేశారు. అలాగే జవహర్‌రెడ్డి కార్యాలయం నుంచి వివిధ శాఖలకు చెందిన 350 ఫైళ్లను ఆయా శాఖలకు తిరిగి పంపేశారు. రావత్, శ్రీధర్ కార్యాలయాల నుంచి కూడా మిగిలిన ఫైళ్లను ఆయా శాఖలకు పంపించేశారు. ఇదిలా ఉండగా సీఎం చేత ఆమోదింప చేసుకున్న ఫైళ్లకు సంబంధించి జీవోలు జారీ అవుతాయా లేదా అనే ఆందోళనతో పైరవీకారులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భూ కేటాయింపులతో పాటు విజిలెన్స్, ఎసీబీ కేసులకు సంబంధించిన పలు ఫైళ్లపై ముఖ్యమంత్రి చివరి రోజుల్లో సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీఎం రాజీనామాతో అధికారులు ఆ ఫైళ్లకు సంబంధించిన జీవోలను జారీ చేస్తారా లేదా అనే ఆందోళనలో పైరవీకారులున్నారు. మరోవైపు సీఎం కార్యాలయంలో ముఖ్యకార్యదర్శిగా పనిచేసి బదిలీ అయిన అజయ్ కల్లం బుధవారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు. అలాగే సీఎం కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసి బదిలీ అయిన జవహర్‌రెడ్డి సాగునీటి శాఖ కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టారు. -
కిరణ్ నాడు - నేడు
-
అమ్మ డైరెక్షన్లోనే....
ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ హడావిడి చూస్తుంటే ఎలాగైనా మ్యాచ్ గెలిపిస్తాడని అనుకున్నారు ప్రేక్షకులు. అయిదు బంతులు అయిపోయాయి. ఒక్క పరుగూ రాలేదు. చివరి బంతికైనా సిక్స్ కొడతాడని అనుకున్నారందరూ. ఆ చివరి బంతి పడకుండానే మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ మొత్తం అయిపోయింది. ప్రేక్షకులైన తెలుగు ప్రజలు దారుణంగా మోసానికి గురయ్యారు. యావత్ తెలుగుజాతి ఓడిపోయింది. అయినా ఆట అయిపోలేదని ఒక ప్లేయర్ గ్రౌండ్లో దిగారు. అతనెవరో కాదు....నన్ అదర్ దేన్.. తెలుగు రాని..తెలుగు ప్రజల ..చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి. నిన్నటి దాకా లాస్ట్ బాల్ మిగిలే ఉంది.. సిక్స్ కొడతా.. ఫోర్ కొడతా.. భూకంపం ఆపుతా.. సునామీని ఆపలేకపోవచ్చు కానీ... విభజనను ఆపుతా అంటూ బీరాలు పోయిన కిరణ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు అమ్మ డైరెక్షన్లో కొత్త డ్రామా మొదలుపెట్టారని యావత్ లోకం కోడై కూస్తోంది. అతని సన్నిహిత ఎమ్మెల్యేలు కూడా ఇదే మాటను నొక్కి వక్కాణించి చెబుతున్నారు. సోనియమ్మ డైరెక్షన్లోనే రాజీనామా చేసి కొత్తపార్టీ పెట్టి పోటీ చేస్తే ఎలక్షన్ ఖర్చులు.. మొత్తం ఇస్తానని హైకమాండ్ హామీ ఇచ్చిందంట.. అంతే.. మరోసారి ఆలోచించకుండా రాజీనామా డ్రామాకి తెరతీసారు. ఈ విషయం ఢిల్లీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంకో భయంకరమైన జోక్ ఏంటంటే .. పెట్టిన ప్రెస్ మీట్లో కూడా అంతా సోనియా మేడమ్ చెప్పినట్లే చేశాను.. నాదేమీ లేదని అపరిపక్వతను ప్రదర్శించారు. అయితే ఢిల్లీ పెద్దలు ఆడించినట్లే ఆడుతున్నాం కాబట్టి.. కనీసం ఎలక్షన్లలో పోటీ చేయటానికి ఫండ్ అయినా ఇస్తారుగా ... కనీసం అది అయినా మిగులుతుందిగా.. ఎలాగు ఇప్పుడు వేరే పార్టీకి పోయినా టిక్కెట్ దొరకడం కష్టం. అందుకే సీఎంతో ఉండి కనీసం పోటీ అయినా చేద్దామని చాలామంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారట. -
'కిరణ్‌కు మరో ప్రత్యామ్నాయం లేదు'
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తేలిగ్గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాను కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తేలిగ్గా తీసుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌కు రాజీనామా మినహా మరో ప్రత్యామ్నాయం ఏం ఉందని ప్రశ్నించారు. కిరణ్ రాజీనామా దురదృష్టకరం సీఎం కిరణ్ రాజీనామా దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి పల్లంరాజు. రోశయ్య తర్వాత క్లిష్టపరిస్థితుల్లో రాష్ట్రానికి సీఎంగా వచ్చారని పలు పథకాలు చేపట్టారన్నారు. ఏది ఏమైనా సీఎం రాజీనామా చేయడం విచారించాల్సిన విషయం అన్నారు. కాంగ్రెస్ గేమ్ ప్లాన్ : కాగా కిరణ్ రాజీనామా కాంగ్రెస్ గేమ్ ప్లాన్‌లో భాగమని కమలనాధులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనల్లో భాగంగానే సీఎం తన పదవికి రాజీనామా చేశాడని పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సెన్ అన్నారు. ఎన్నికలకు ముందు పార్టీ ఏర్పాటుచేయడం తర్వాత విలీనం చేయడమే కాంగ్రెస్ ప్రణాళిక అని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కూడా ఇలాగే ప్రవర్తించారని షానవాజ్ విమర్శించారు. -
కిరణ్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. రాజీనామా ప్రకటన చేసిన అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి రాజ్‌భవన్‌కు వచ్చిన కిరణ్... గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రం అందజేశారు. గవర్నర్ వెంటనే కిరణ్ రాజీనామాను ఆమోదించారు. అయితే కిరణ్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని గవర్నర్ కోరకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి వెంట మంత్రులు శైలజనాథ్, టీజీ, గంటా శ్రీనివాస్, కాసు, ఏరాసు, పార్థసారధి, పితాని సత్యనారాయణ, మహీధర్‌రెడ్డితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా కిరణ్ రాజీనామా ఆమోదంతో ప్రస్తుత కేబినెట్ రద్దు అయ్యింది. -
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన?
-
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన?
హైదరాబాద్ : రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనపై కేంద్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్న రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా నియమించే సాహసం కాంగ్రెస్ చేస్తుందనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం రాష్ట్రపతి పాలనే. మరీ గవర్నర్ ఎలాంటి సిఫార్సు చేస్తారో చూడాలి. రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకుల్ని చూసిన ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారి 1973 జనవరి 11న రాష్ట్రపతి పాలన విధించారు. నాడు విధించిన పాలన డిసెంబర్ 10, 1973 వరకు కొనసాగింది. ఆ తర్వాత బహుశా మళ్లీ ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తింది. నాడు పీపీ నరసింహరావు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. మరో వైపు రాష్ట్రపతి పాలన అనివార్యమైతే రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను మార్చే అవకాశం ఉంది. అదే జరిగితే రాష్ట్ర గవర్నర్‌గా హన్స్‌రాజ్ భరద్వాజ్ లేదా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను నియమించే అవకాశం ఉంది. -
'సోనియా పదవిలో కొనసాగమంటేనే ....'
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న తర్వాత సోనియాగాంధీ ...ముఖ్యమంత్రి పదవిలో కొనసాగమంటేనే సీఎం పదవిలో ఉన్నానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన బుధవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. సీఎం ప్రెస్‌మీట్ వివరాలు * సీట్లకోసం, అధికారకోసం తెలుగుజాతికి తీవ్ర నష్టం కలిగించారు *విభజన వల్ల తెలుగు ప్రజలకు నష్టం కలుగుతుంది *విభజన వల్ల ప్రజలకు లాభం కాకుండా నష్టం కలుగుతుంది *58 సంవత్సరాలుగా ఇరు ప్రాంతాల వాళ్లు కలిసి ఉన్నారు *ప్రతి సంవత్సరం ప్రజల మధ్య చిచ్చుపెట్టే అంశాలున్నాయి *విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం *విభజన నిర్ణయం తీసుకున్నప్పటినుంచీ ప్రతి అంశంలోనూ ఉల్లంఘనలు జరిగాయి *పద్ధతి ప్రకారం విభజన జరగలేదు.. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి *టేబుల్ ఐటెంగా కేబినెట్ భేటీలో పెట్టారు *కనీసం నోట్‌ను చదువుకునే అవకాశాన్ని కేబినెట్ మంత్రులకూ ఇవ్వలేదు *జీవోఎం ఏర్పాటుతో పాటు చేసిన పద్ధతులన్నీ ఉల్లంఘనలే *ఇదే బిల్లు పార్లమెంటులో పెడితే బుట్టదాఖలు అవుతుందని చెప్పాను *లేకపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటానని చెప్పాను *అయితే దీనివల్ల రాజీనామా చేయడంలేదు *డ్రాఫ్టు బిల్లుపై అసెంబ్లీ చర్చించడం ఎంతవరకు సమంజసం *పార్లమెంటులో బిల్లు నడిపిన తీరుకూడా ఎంతవరకు సమంజసం? *పార్లమెంటు సభ్యులను కొట్టించారు *పార్లమెంటులో ప్రవర్తన దిగజారిపోయింది *రాష్ట్ర సభ్యులు లేకుండా చేసి దొంగల మాదిరిగా వ్యవహరించారు *ప్రత్యక్షప్రసారాలను ఎందుకు నిలిపేశారో దేశప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది *అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును తిరస్కరిస్తే.. అది సమాఖ్య స్ఫూర్తికి అగౌరవం కాదా? *ప్రతిపక్ష బీజేపీ కూడా కుమ్మక్కైంది *బీజేపీ చీకటి ఒప్పందాలను చేసుకుంది *తెలుగువారి హృదయాలను గాయపరిచారు *తెలుగుజాతిని నిలువునా చీలుస్తున్నారు *ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడానికి కాంగ్రెస్... అనేక సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాల్లోనిర్ణయించింది *అలాంటి రాష్ట్రాన్ని విభజించడంతో దేశం బాగుపడుతుందా? *ప్రజాస్వామ్యాన్ని హేళన చేశారు *ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి కుమ్మక్కు చేశారు *నా ఎదుగుదలకు, సీఎం పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు *కాని తెలుగువారి గుండెలను గాయపరిచినందుకు రాజీనామా *సీఎం, ఎమ్మెల్యే పదవులతో సహా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా *ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలకు 3రోజుల ముందే నాతో మాట్లాడారు *సోనియాగాంధీ, నేను మాత్రమే మాట్లాడాం *తెలంగాణపై నిర్ణయం తీసుకుందామా? అని అడిగారు *బడ్జెట్ సెషన్స్ తర్వాత అంటే మార్చి 28 తర్వాత తీసుకోమని చెప్పాను *ఆతర్వాత 50 సార్లు నిర్ణయం తీసుకోమన్నా తీసుకోలేదు *సీడబ్ల్యూసీ తర్వాత రాజీనామా చేస్తానంటే కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోలేదు *తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత సోనియా పదవిలో కొనసాగమంటేనే కొనసాగాను -
సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి కిరణ్ రాజీనామా
-
ఇప్పుడు కిరణ్ రాజీనామా వల్ల ఉపయోగం ఉంటుందా?
-
సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి కిరణ్ రాజీనామా
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు లాస్ట్ బాల్ వేశారు. ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లో తన రాజీనామాను ప్రకటించారు. విభజన ప్రక్రియలో భాగస్వామికి కాలేకే రాజీనామా చేసినట్లు కిరణ్ తెలిపారు. విభజన బిల్లు తప్పుల తడకగా ఉందని, అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో పెట్టటమే రాజ్యాంగ విరుద్ధం కనుక దానిపై న్యాయపోరాటం చేయాల్సిన అవసరముందని చెప్పారు. -
విభజన వల్ల తెలుగువారందరికి నష్టం: సీఎం కిరణ్
హైదరాబాద్ : రాష్ట్ర విభజన వల్ల తెలుగువారందరికి నష్టం కలుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన అనంతరం తొలిసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విభజన విషయంలో కేంద్రం అనుసరించిన విధానంపై సిగ్గుతో తలదించుకోవాలన్నారు.