
కిరణ్ రాజీనామా ఆమోదించిన గవర్నర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక జరిగేవరకూ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. అలాగే కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపారు. తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందటంతో బుధవారం కిరణ్ కుమార్ రెడ్డి తన సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందచేశారు.