ప్రభుత్వం ఏర్పాటుచేస్తాం.. అవకాశమివ్వండి
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించొద్దని, తమకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని నలుగురు రాష్ట్ర మంత్రులు గవర్నర్ నరసింహన్ను కోరారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీ నారాయణ, ఎన్.రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి గురువారం నాడు గవర్నర్ నరసింహన్ను కలిశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో వాళ్లు వెళ్లి నరసింహన్తో భేటీ అయ్యారు. నరసింహన్ను కలిసిన మంత్రులలో వట్టి వంసతకుమార్, దానం నాగేందర్ తదితరులు కూడా ఉన్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మంత్రుల మద్దతును సమీకరించే ప్రయత్నాల్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
తమ నలుగురిలో ఎవరమైనా సరే, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని, తమకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం కల్పించాలని ఆయనకు విజ్క్షప్తి చేశారు. ఇలాంటి కీలక తరుణంలో రాష్ట్రపతి పాలన విధించడం సరికాదని, అందువల్ల తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని కోరినట్లు సమాచారం.