ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ఉందనగా ముఖ్యమంత్రి వెళ్లి గవర్నర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు అరగంట పాటు వీరిద్దరి సమావేశం జరిగింది. గతంలో కూడా అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తారన్న కథనాలు రావడం, అది మామూలేనని.. దాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని ముఖ్యమంత్రి అనుకూల వర్గాలు కొట్టేయడం తెలిసిందే.
రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వస్తుందని చెబుతున్న తరుణంలో గవర్నర్తో ముఖ్యమంత్రి ఏం చర్చించారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విభజన బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామని కూడా కిరణ్ గట్టిగా చెబుతున్న విషయం తెలిసిందే.