అమ్మ డైరెక్షన్లోనే.... | Kiran kumar reddy Bowls Last Ball in Telangana bill | Sakshi
Sakshi News home page

అమ్మ డైరెక్షన్లోనే...

Published Wed, Feb 19 2014 2:42 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

అమ్మ డైరెక్షన్లోనే.... - Sakshi

అమ్మ డైరెక్షన్లోనే....

ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ హడావిడి చూస్తుంటే ఎలాగైనా మ్యాచ్‌ గెలిపిస్తాడని అనుకున్నారు ప్రేక్షకులు. అయిదు బంతులు అయిపోయాయి. ఒక్క పరుగూ రాలేదు. చివరి బంతికైనా సిక్స్‌ కొడతాడని అనుకున్నారందరూ. ఆ చివరి బంతి పడకుండానే మ్యాచ్‌ అయిపోయింది.

మ్యాచ్ మొత్తం అయిపోయింది. ప్రేక్షకులైన తెలుగు ప్రజలు దారుణంగా మోసానికి గురయ్యారు. యావత్ తెలుగుజాతి ఓడిపోయింది. అయినా ఆట అయిపోలేదని ఒక ప్లేయర్ గ్రౌండ్‌లో దిగారు. అతనెవరో కాదు....నన్‌ అదర్‌ దేన్.. తెలుగు రాని..తెలుగు ప్రజల ..చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి.

నిన్నటి దాకా లాస్ట్ బాల్ మిగిలే ఉంది.. సిక్స్ కొడతా.. ఫోర్ కొడతా.. భూకంపం ఆపుతా.. సునామీని ఆపలేకపోవచ్చు  కానీ... విభజనను ఆపుతా అంటూ బీరాలు పోయిన కిరణ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు అమ్మ డైరెక్షన్‌లో కొత్త డ్రామా మొదలుపెట్టారని యావత్ లోకం కోడై కూస్తోంది. అతని సన్నిహిత ఎమ్మెల్యేలు కూడా ఇదే మాటను నొక్కి వక్కాణించి చెబుతున్నారు.

సోనియమ్మ డైరెక్షన్‌లోనే రాజీనామా చేసి కొత్తపార్టీ పెట్టి పోటీ చేస్తే ఎలక్షన్ ఖర్చులు.. మొత్తం ఇస్తానని హైకమాండ్ హామీ ఇచ్చిందంట.. అంతే.. మరోసారి ఆలోచించకుండా రాజీనామా డ్రామాకి తెరతీసారు. ఈ విషయం ఢిల్లీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంకో భయంకరమైన జోక్ ఏంటంటే .. పెట్టిన ప్రెస్ మీట్‌లో కూడా అంతా సోనియా మేడమ్‌ చెప్పినట్లే చేశాను.. నాదేమీ లేదని అపరిపక్వతను ప్రదర్శించారు.

అయితే ఢిల్లీ పెద్దలు ఆడించినట్లే ఆడుతున్నాం కాబట్టి.. కనీసం ఎలక్షన్లలో పోటీ చేయటానికి ఫండ్ అయినా ఇస్తారుగా ... కనీసం అది అయినా మిగులుతుందిగా.. ఎలాగు ఇప్పుడు వేరే పార్టీకి పోయినా టిక్కెట్ దొరకడం కష్టం. అందుకే సీఎంతో ఉండి కనీసం పోటీ అయినా చేద్దామని చాలామంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement