Last ball
-
Ireland vs New Zealand: ఐర్లాండ్ ఓడినా... వణికించింది!
డబ్లిన్: అయ్యో... ఐర్లాండ్! కొండను కరిగించే పనిలో పరుగు తేడాతో ఓడింది. ఇదివరకే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన ఐర్లాండ్ మూడో మ్యాచ్ ఓటమితో ‘వైట్‌వాష్’ అయ్యింది. కానీ అసాధారణ పోరాటంతో ఆఖరి బంతి దాకా కివీస్ ఆటగాళ్లను వణికించింది. కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 360 పరుగుల భారీస్కోరు చేసింది. గప్టిల్ (126 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా, నికోల్స్ (54 బంతుల్లో 79; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. గట్టి ప్రత్యర్థి తమ ముందుంచిన కొండంత లక్ష్యాన్ని చూసి ఏమాత్రం బెదిరిపోని ఐర్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 359 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (103 బంతుల్లో 120; 14 ఫోర్లు, 5 సిక్సర్లు), హ్యారీ టెక్టర్ (106 బంతుల్లో 108; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల సెంచరీలతో ఓ దశలో న్యూజిలాండ్‌ను ఓడించినంత పని చేశారు. చివరి బంతికి 3 పరుగుల కావాల్సి వుండగా, ‘బై’ రూపంలో పరుగు మాత్రమే వచ్చింది. -
లాస్ట్ బాల్ -part 2
-
లాస్ట్ బాల్ part 1
-
ఆఖరి బంతి మిగిలే ఉంది
సమైక్య ఛాంపియన్...! ఇంకా ఆట ముగిసిపోలేదు...!! ఆఖరి బంది మిగిలే ఉంది....!!అని చెప్పుకుంటూ చివరి క్షణం వరకు సీఎం కుర్చీలో కొనసాగిన కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆఖరు బంతి అంటే చివరి వరకు అధికారంలో కొనసాగడమేనన్న విమర్శలు రావడంతో... విభజన జరిగినట్లు కాదు. ఇంకా చాలా తంతు ఉంది...! అని చెబుతూ ఆట ఇప్పుడే ప్రారంభమైందన్న రీతిలో కొత్త పార్టీ గురించి వివరించడం మొదలుపెట్టారట. ఆయన కొత్త పార్టీతో ఇంకా ఆట మొదలు కాకముందే ఒక వికెట్ కోల్పోయింది. నేనొస్తానంటూ చెప్పిన కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ ఒకరు ఆయన టీమ్‌లో చేరకుండానే బ్యాట్ కింద పడేశారు. టీమ్ లో ఒకరు లేనంత మాతాన ఆట ఆగదని మొదలు పెట్టిన లీడర్ తొలి వ్యాఖ్యలే మిగతా ఆటగాళ్లను నీరసపరిచాయట. ఇంకా మైదానంలోకి దిగకముందే ఆట ఎందుకు ఆడబోతున్నామో కిరణ్ చెప్పిన మాటలు క్రీడాకారులను (ఆ పార్టీలో చేరిన నేతలు)దిమ్మదిరిగేలా చేశాయట. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ ప్రజలు నోటా (పైవారెవరూ కాదు) బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారంతా మాకు ఓటు వేయాలి...అని కిరణ్ పిలుపిచ్చారు. ఓహో... ఇదేదో బాగుందే అని ఆ పార్టీలో చేరిన ఒక కొత్తనేతకు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఇటీవల ఢిల్లీ, మధ్యప్రదేశ్్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తొలిసారి ఈవీఎంలో నోటా ప్రవేశపెట్టగా, అనేక చోట్ల నోటా మీట నొక్కిన వారు వందల్లో మాత్రమే ఉన్నారని తెలిసి.... మా పరిస్థితి అంతేనా అని సణుక్కున్నారు. -
అమ్మ డైరెక్షన్లోనే....
ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ హడావిడి చూస్తుంటే ఎలాగైనా మ్యాచ్ గెలిపిస్తాడని అనుకున్నారు ప్రేక్షకులు. అయిదు బంతులు అయిపోయాయి. ఒక్క పరుగూ రాలేదు. చివరి బంతికైనా సిక్స్ కొడతాడని అనుకున్నారందరూ. ఆ చివరి బంతి పడకుండానే మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ మొత్తం అయిపోయింది. ప్రేక్షకులైన తెలుగు ప్రజలు దారుణంగా మోసానికి గురయ్యారు. యావత్ తెలుగుజాతి ఓడిపోయింది. అయినా ఆట అయిపోలేదని ఒక ప్లేయర్ గ్రౌండ్లో దిగారు. అతనెవరో కాదు....నన్ అదర్ దేన్.. తెలుగు రాని..తెలుగు ప్రజల ..చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి. నిన్నటి దాకా లాస్ట్ బాల్ మిగిలే ఉంది.. సిక్స్ కొడతా.. ఫోర్ కొడతా.. భూకంపం ఆపుతా.. సునామీని ఆపలేకపోవచ్చు కానీ... విభజనను ఆపుతా అంటూ బీరాలు పోయిన కిరణ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు అమ్మ డైరెక్షన్లో కొత్త డ్రామా మొదలుపెట్టారని యావత్ లోకం కోడై కూస్తోంది. అతని సన్నిహిత ఎమ్మెల్యేలు కూడా ఇదే మాటను నొక్కి వక్కాణించి చెబుతున్నారు. సోనియమ్మ డైరెక్షన్లోనే రాజీనామా చేసి కొత్తపార్టీ పెట్టి పోటీ చేస్తే ఎలక్షన్ ఖర్చులు.. మొత్తం ఇస్తానని హైకమాండ్ హామీ ఇచ్చిందంట.. అంతే.. మరోసారి ఆలోచించకుండా రాజీనామా డ్రామాకి తెరతీసారు. ఈ విషయం ఢిల్లీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంకో భయంకరమైన జోక్ ఏంటంటే .. పెట్టిన ప్రెస్ మీట్లో కూడా అంతా సోనియా మేడమ్ చెప్పినట్లే చేశాను.. నాదేమీ లేదని అపరిపక్వతను ప్రదర్శించారు. అయితే ఢిల్లీ పెద్దలు ఆడించినట్లే ఆడుతున్నాం కాబట్టి.. కనీసం ఎలక్షన్లలో పోటీ చేయటానికి ఫండ్ అయినా ఇస్తారుగా ... కనీసం అది అయినా మిగులుతుందిగా.. ఎలాగు ఇప్పుడు వేరే పార్టీకి పోయినా టిక్కెట్ దొరకడం కష్టం. అందుకే సీఎంతో ఉండి కనీసం పోటీ అయినా చేద్దామని చాలామంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారట. -
రూల్ 77 కింద స్పీకర్‌కు తిరస్కరణ నోటీసు ఇచ్చిన సిఎం
-
ముఖ్యమంత్రి లాస్ట్బాల్ బూమెరాంగ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇన్నాళ్లుగా లాస్ట్బాల్ అంటూ ఊరించిన వ్యూహం కాస్తా బూమెరాంగ్ అయ్యింది. సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు.. చీఫ్ విప్ కూడా ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో తిరగబడ్డారు. రాష్ట్ర విభజన బిల్లు అంతా తప్పులు తడకలుగా ఉన్నందున దాన్ని రాష్ట్రపతికి తిప్పి పంపాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు ఇచ్చారు. అసెంబ్లీ రూల్ 77 కింద విభజన బిల్లును తిప్పి పంపాలని ఆయన కోరారు. అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. స్వయంగా చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ముఖ్యమంత్రిపై తాము విశ్వాసం కోల్పోయామని తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు విపక్షనేత చంద్రబాబు కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, విభజన బిల్లులో తప్పులున్నాయన్న పేరుతో వాటిని వెనక్కి పంపాలని చెప్పడం సరికాదన్నారు. ఇన్నాళ్లు దీని గురించి ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు విభజన బిల్లు వెనక్కి పంపాలని సీఎం స్పీకర్‌కు లేఖ రాయడం ఏకపక్ష నిర్ణయమని ఆయన చెప్పారు. ఆయన వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, సీఎంపై విశ్వాసం కోల్పోయామని గవర్నర్‌ను కలిసేందుకు తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులమంతా చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. పనిలో పనిగా గండ్ర వెంకట రమణారెడ్డితో పాటు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు కేటీఆర్, ఈటెల రాజేందర్ గవర్నర్ నరసింహన్‌ను కూడా కలవాలని నిర్ణయించారు. -
సిఎం కిరణ్ చివరి బాల్!
-
సిఎం కిరణ్ చివరి బాల్!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి బాల్ సిద్ధం చేసుకుంటున్నారు. అసెంబ్లీలో తన ప్రసంగం ముగియగానే సిఎం పదవికి ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తోంది. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేస్తారని జాతీయ మీడియా కథనం. పదవికి రాజీనామా చేయడమే లాస్ట్ బాల్‌గా చెబుతున్నారు. పైకి సమైక్య వాదం, లోపల అవకాశవాదం... ఇదీ కిరణ్‌కుమార్ ఎజెండానా.? అవునంటున్నాయి జాతీయ ఛానళ్లు. అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం ఫస్ట్ ఎపిసోడ్ నిన్న చదివేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్.. ఇవ్వాళ రెండో ఎపిసోడ్ చదవనున్నారు. గడువు గురించి రాష్ట్రపతి ఏమి తేల్చకపోవడంతో ఇవ్వాళ రెండో ఎపిసోడ్ అయిపోగానే.. కిరణ్‌కుమార్ తన లాస్ట్ బాల్ విసురుతారట. లాస్ట్బాల్ అంటే మరేంటో కాదు.. తన ప్రసంగం ముగియగానే కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారట. ఇదే విషయాన్ని ఐబీఎన్ గ్రూప్ తన వెబ్సైట్లో బయటపెట్టింది. ఇన్నాళ్లు తెర వెనక పార్టీ పనులు పురమాయించిన కిరణ్.. ఇక పదవికి గుడ్‌బై చెప్పి ఎన్నికలకు సిద్ధమవుతారట. ఈ లెక్కన ఇన్నాళ్లు సమైక్యమంటూ చేసిన వాదనలు.. కేవలం రాజకీయ అవకాశవాదం కోసమేనని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. ప్రసంగం ముగియగానే సభలోనే రాజీనామా ప్రకటించడం, అనంతరం సభ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని ప్రకటించడం.. ఇదీ ఇప్పుడు సీఎం ఎజెండా అంటున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టంగా భావిస్తున్నానంటూ నిన్న చేసిన స్పీచ్ కూడా దీనికి ఇండికేషన్ అని చెబుతున్నారు. ఇవన్నీ పక్కనబెడితే.. సీఎం కిరణ్ రేపు ఢిల్లీ వస్తారని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అంటే కొత్త పార్టీ పెట్టడం కూడా హైకమాండ్ స్ట్రాటజీలో భాగమేనన్నమాట...! ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టంగా భావిస్తున్న సీఎం కిరణ్... తరువాత ఏంటి? సమైక్యమో... కాంగ్రెస్ పార్టీనో తేల్చుకునే పరిస్థితి వస్తే... ఆయన ఎటు మొగ్గు చూపుతారు? సుదీర్ఘ ప్రసంగానికి సిద్ధమైన కిరణ్... ప్రసంగం ముగియగానే రాజీనామా చేస్తారా? సీఎం కిరణ్ వ్యూహమిదేనని జాతీయ మీడియా అంటోంది. సీఎం విసిరే లాస్ట్ బాల్ రాజీనామానేనని ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేసిన వెంటనే కొత్త పార్టీని ప్రకటిస్తారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే మరో వైపు కిరణ్ రేపు ఢిల్లీ వస్తారని దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారు. -
సీఎం కిరణ్ లాస్ట్ బాల్ లోగుట్టు ఏంటీ?