Ireland vs New Zealand: ఐర్లాండ్‌ ఓడినా... వణికించింది! | Ireland vs New Zealand: New Zealand Beat Ireland By 1 Run In Thriller 3rd ODI | Sakshi
Sakshi News home page

Ireland vs New Zealand: ఐర్లాండ్‌ ఓడినా... వణికించింది!

Published Sat, Jul 16 2022 4:12 AM | Last Updated on Sat, Jul 16 2022 4:12 AM

Ireland vs New Zealand: New Zealand Beat Ireland By 1 Run In Thriller 3rd ODI - Sakshi

డబ్లిన్‌: అయ్యో... ఐర్లాండ్‌! కొండను కరిగించే పనిలో పరుగు తేడాతో ఓడింది. ఇదివరకే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోల్పోయిన ఐర్లాండ్‌ మూడో మ్యాచ్‌ ఓటమితో ‘వైట్‌వాష్‌’ అయ్యింది. కానీ అసాధారణ పోరాటంతో ఆఖరి బంతి దాకా కివీస్‌ ఆటగాళ్లను వణికించింది. కివీస్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 360 పరుగుల భారీస్కోరు చేసింది. గప్టిల్‌ (126 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా,  నికోల్స్‌ (54 బంతుల్లో 79; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు.

గట్టి ప్రత్యర్థి తమ ముందుంచిన కొండంత లక్ష్యాన్ని చూసి ఏమాత్రం బెదిరిపోని ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 359 పరుగులు చేసింది. పాల్‌ స్టిర్లింగ్‌ (103 బంతుల్లో 120; 14 ఫోర్లు, 5 సిక్సర్లు), హ్యారీ టెక్టర్‌ (106 బంతుల్లో 108; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల సెంచరీలతో ఓ దశలో న్యూజిలాండ్‌ను ఓడించినంత పని చేశారు. చివరి బంతికి 3 పరుగుల కావాల్సి వుండగా, ‘బై’ రూపంలో పరుగు మాత్రమే వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement